Education: విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు...
Sakshi Education
మనబడి నాడు–నేడు ఫేజ్–1, ఫేజ్–2 అభివృద్ధి పనుల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 540 పాఠశాలల్లో 814 పనులను రూ.144.78 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. సర్కారు బడులకు ఆధునిక సొబగులు అద్దుతోంది.
- జగనన్న గోరుముద్దను 1582 పాఠశాలల్లో అమలు చేస్తోంది. 71,280 మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారాన్ని సమకూర్చుతోంది.
- ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి 86,490 మంది తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.129.61కోట్లను జమ చేసింది.
- జగన్న విద్యాకానుక పథకం కింద 97,474మంది విద్యార్థులకు జగనన్న విద్యాకిట్లను అందజేసేందుకు జిల్లాకు రూ.29.69 కోట్లను ఖర్చుచేసింది.
- కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్‌లైన్ కంటెంట్ కోసం జిల్లాలో 9,775 మంది విద్యార్థులు, 1878 మంది ఉపాధ్యాయులకు రూ.37.39 కోట్ల విలువైన ట్యాబ్‌లను సమకూర్చింది.
Published date : 10 Apr 2023 06:23PM