AP Tenth Class exam fee : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు 30వ తేదీ వరకు గడువు
పెడన: 2023–24 విద్యా సంవత్సరంలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించడానికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు పెంచారని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలలకు చెందిన హెచ్‌ఎంలు ఈ విషయాన్ని గమనించి 30వ తేదీ వరకు చెల్లింపులు చేసుకుని అదే రోజున నామినల్ రోల్స్‌ను పంపించాల్సి ఉంటుందన్నారు.
Also Read : AP 10th Class Study Material
రూ.50 అపరాధ రుసుంతో డిసెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు చెల్లించుకోవచ్చునని, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు ఐదో తేదీ నుంచి 9వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబరు పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు పరీక్ష ఫీజులు కట్టుకునే అవకాశం ఉందన్నారు. హెచ్‌ఎంలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో స్కూలు లాగిన్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలు కూడా ఇదే వెబ్‌సైట్‌లో ఉన్నాయని, పాఠశాలల హెచ్‌ఎంలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో చెల్లించాలని డీఈవో పేర్కొన్నారు.