Tenth Class Tatkal Scheme: పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు కోసం తత్కాల్‌స్కీమ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో ఒక్కసారి తప్పిన విద్యార్థులు మార్చి–2024లో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లింపు కోసం తత్కాల్‌స్కీమ్‌లో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. ఈ ఫీజు చెల్లించే విద్యార్థులు ఈ నెల 28 నుంచి జనవరి రెండో తేదీ లోపు రూ.500 ఆలస్య రుసుంతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : Biology Study Material
ఫీజు చెల్లించేందుకు ఎట్టి పరిస్థితుల్లో తేదీల పొడిగింపు ఉండదని పేర్కొన్నారు. అలాగే మార్చి–2024 పరీక్షకు ఫీజు చెల్లించిన వారికి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు అర్హులవుతారని తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో వారికిచ్చిన ఐడీ, పాస్‌వోడ్‌లను వినియోగించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.