Tenth Class Fee Payment Deadline: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
Sakshi Education

కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించినట్లు డీఈఓ డాక్టర్ వి.రంగారెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజులతో పాటు, ఒకేషనల్ అభ్యర్థులు, మైగ్రేషన్ సర్టిఫికేట్ల కోసం రుసుము ఆన్‌లైన్‌లో నామినల్ రోల్‌తో పాటు www. bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చెల్లించాలన్నారు.
Also Read : Success Story : కూలీ కొడుకు.. వందల కోట్లకు అధిపతి.. ఎలా అంటే..?
ఈ నెల 5వ తేదీ వరకు గడువు పొడిగించారని, రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల 10వ తేదీలోపు, రూ.200 ఫైన్‌తో 12వ తేదిలోపు, రూ.500 ఫైన్‌తో 14వ తేదిలోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. షెడ్యుల్ కులాలు/షెడ్యుల్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు.
Published date : 05 Dec 2023 11:20AM