కె.కోటపాడు: చదువుపై మమకారంతో ఎ.కోడూరు హైస్కూల్‌కు చెందిన విద్యార్థి పైల ఎర్నికుమార్ నడవలేని స్థితిలోనూ పది పరీక్షలకు హాజరవుతున్నాడు.
పట్టుదలతో... పది పరీక్షలకు హాజరు!
మండలంలోని జోగన్నపాలెంలో తన ఇంటి వద్ద మార్చి 15న జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. అతడి కుడి కాలికి తీవ్ర గాయం కావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. పది పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తన బంధువుల సహాయంతో ఆటోలో కె.కోటపాడు కేంద్రానికి రోజూ చేరుకుంటున్నాడు. అక్కడ అతడు పరీక్ష రాసేందుకు వీలుగా కేంద్రం చీఫ్ బి.సూర్యనారాయణమూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారు. నడవ లేని స్థితిలో విద్యార్థి పట్టుదలతో పరీక్షలకు వస్తుండటాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.