Merugu Nagarjuna: విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం
Sakshi Education
సాక్షి, అమరావతి : సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.
ఇతర గురుకులాల్లో లేని విధంగా ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు విద్య, వైద్యం, ఆరోగ్యం మెరుగుదల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలపై ఆయన నవంబర్ 3న మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
చదవండి: UDISE Plus: ఈ ఏడాదిలో ఇన్ని వేల స్కూళ్లు మూసివేత
సీఎం జగన్ ఆదేశాలతో చేపట్టిన కార్యక్రమాలను మంత్రి వివరించారు. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ, టీసీఎస్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీసీఎస్, ఈ విద్యాలోక్, వాయిస్ ఫర్ గర్ల్స్ వంటి ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: Schools: ఇక్కడి స్కూళ్లలో ఔట్‌డోర్ బంద్.. ఈ తరగతి పిల్లలకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు..
Published date : 04 Nov 2022 04:00PM