Skip to main content

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు ఇవ్వడంలేదు

ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, దీన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు ఇవ్వడంలేదు
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు ఇవ్వడంలేదు

ఈ వ్యాజ్యంపై జూలై 7న విచారించిన హైకోర్టు.. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. విద్యాహక్కు చట్ట నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ 2017లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ప్రభుత్వం స్పందిస్తూ.. 2022 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, విద్యాహక్కు చట్టంలోని ఈ నిబంధనను తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిల్‌ను ఈ ఏడాది జనవరిలో పరిష్కరించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ యోగేష్‌ తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

చదవండి: 

Published date : 08 Jul 2022 03:04PM

Photo Stories