Skip to main content

Free Private School Admissions: ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు గడువు పెంపు

విజయనగరం అర్బన్‌: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలు ప్రైవేట్‌ స్కూల్స్‌లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశం పొందడానికి మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు.
Extension of deadline for free admissions in private schools

ఈ మేరకు మార్చి 26న‌ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా విద్యార్ధుల నివాసానికి సమీపంలో ఉన్న అన్ని ప్రైవేట్‌, అన్‌ ఎయిడెంట్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం కోటా కింద ఉచిత ప్రవేశం పొందవచ్చని తెలిపారు.

చదవండి: AP Model Schools:ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసక్తిగల వారు వెబ్‌సైట్‌ లేదా దగ్గరలోని సచివాలయం/ఇంటర్నెట్‌, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం/మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయం పనివేళల్లో సంప్రదించవచ్చని సూచించారు.

Published date : 27 Mar 2024 03:07PM

Photo Stories