Andhra Pradesh: కంప్యూటర్ విద్య కేవలం డబ్బున్నోళ్లకు మాత్రమే కాదు
ఓ వైపు తరగతి గదుల్లో డిజిటల్‌గా, మరోవైపు ఇంగ్లీష్ మీడియం బోధనతో బాటు విద్యార్థులకు ఉన్నత పాఠశాల నుంచే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కంప్యూటర్ బోధన ఉండాలనే లక్ష్యంతో ట్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
బైజూస్ యాప్ అందుబాటులోకి వచ్చినా అందులో ఉండే కంటెంట్ కొనుగోలు చేసే ఆర్థిక పరిస్థితి లేని పేద తల్లిదండ్రుల్లో ఎలాంటి బాధ లేకుండా ప్రభుత్వమే బైజూస్ కంటెంట్ కొనుగోలు చేసి ట్యాబ్‌ల్లో పొందుపరిచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది.
చదవండి: Andhra Pradesh: పని నుంచి బడికి..విద్యార్థులుగా మారుతున్న బాల కార్మికులు..
ప్రస్తుతం పల్లెటూరిలో ఉండే ఎనిమిదవ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబ్ కనిపిస్తోంది. అందులో అత్యంత విలువైన సబ్జెక్టులతో కూడిన బైజూస్ కంటెంట్ కూడా ఉంది. దీంతో విద్యార్థులు తమ సబ్జెక్టులకు సంబంధించి ఏ సమయంలోనైనా ఎలాంటి డౌట్స్ అయినా సరే నివృత్తి చేసుకునే ఆస్కారం కలిగింది.
జిల్లాలో 17,330 వేల ట్యాబ్‌లు పంపిణీ..
జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది విద్యాసంవత్సరానికి సంబఽంధించి 17,330 వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తోంది.
చదవండి: Success Stories : ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎస్ ఉద్యోగం కొట్టామిలా.. మా సక్సెస్‌కు కారణం ఇదే..
ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.33 వేలు..
ఇదిలా ఉండగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.33 వేలు. ఆ లెక్క ప్రకారం జిల్లాలో గత ఏడాది పంపిణీ చేసిన 18 వేల ట్యాబ్‌లు ఖరీదు రూ.59.40 కోట్లు కాగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న 17,330 ట్యాబ్‌లకు గాను రూ.57.18 కోట్లు అవుతోంది.
జగన్ మామయ్యకు కృతజ్ఞతలు
నా పేరు ఎన్.సుప్రియ నేను చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. నాకు గత ఏడాది ప్రభుత్వం ట్యాబ్ ఇచ్చింది. ఆ ట్యాబ్‌లో 8, 9, 10 తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఎంతో విలువైన బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్ ఇచ్చారు. మాకున్న ఆర్థిక స్తోమత ప్రకారం రూ.33 వేలు వెచ్చించి ట్యాబ్ కొనుగోలు చే సుకోలేం. ఉపాధ్యాయులు బోధించిన తరువాత ఇంటికి వెళ్లి ట్యాబ్‌లో కూడా చూసుకుని డౌట్స్ తీర్చుకుంటున్నాం. ట్యాబ్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. జగన్ మామయ్యకు థ్యాంక్స్ చెప్పుకోవాలి.
– ఎన్.సుప్రియ, 9వ తరగతి విద్యార్థిని
ట్యాబ్‌లు ఎంతో ఉపయోగకరం
నా పేరు ఎం.రాణిగాయత్రి, నేను చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. సీఎం జగన్ సార్ మాకు ఎంతో ఉపయోగమైన ట్యాబ్‌లు ఇచ్చారు. ఈ ట్యాబ్‌లు కొనుగోలు చేసుకునే ఆర్థిక స్తోమత మాకు లేదు. కానీ బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ప్రభుత్వం ఇచ్చింది. సబ్జెక్టు పరంగా ఈ ట్యాబ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– ఎం.రాణి గాయత్రి, 9వ తరగతి
ప్రారంభమైన ట్యాబ్‌ల పంపిణీ
జిల్లాలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 17,330 వేల మంది ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నాం. డిసెంబర్ 21 నుంచే అన్ని పాఠశాలల్లో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఎంతో విలువైన కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– లింగేశ్వరరెడ్డి, డీఈఓ, విజయనగరం