School Education Department: స్కూళ్లలో పిల్లల భద్రతకు చర్యలు.. జారీ చేసిన ఆదేశాలివీ..
Sakshi Education
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు రెండో దశ పనులు జరుగుతున్న స్కూళ్లలో పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పాఠశాలులు తెరిచినందున రెండో దశ పనులు జరుగుతున్న స్కూళ్లలో ప్రత్యేక భద్రత చర్యలపై పలు సూచనలు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: Department of Technical Education: మరింత మెరుగ్గా సాంకేతిక విద్యాశాఖ వెబ్‌సైట్
జిల్లాల విద్యా శాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాలివీ..
- పాఠశాలల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జిల్లా, మండల అధికారులు స్వయంగా స్కూళ్లకు వెళ్లి పరిశీలించాలి
- తల్లిదండ్రుల కమిటీ, ఇంజనీర్‌తో కలిసి హెడ్ మాస్టర్ పాఠశాల ఆవరణ మొత్తం తిరిగి ప్రమాదాలు జరిగే ప్రదేశాలను, పరికరాలను గుర్తించాలి
- ఆ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చూడాలి.
- హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పిల్లలు, సిబ్బంది వెళ్లకుండా సేఫ్టీ టేపులతో కంచెలు వేయాలి
- పిల్లలు, సిబ్బంది రాకపోకలకు సురక్షిత మార్గాలు ఏర్పాటు చేయాలి
- స్కూలు తెరవడానికి ముందు లేదా స్కూలు సమయం ముగిసిన తరువాతే యంత్రాలు, పరికరాలు, మెటీరియల్ తొలగించాలి
- కూల్చివేతలు చేపట్టినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలి
- వ్యర్థాలను పాఠశాలలకు దూరంగా వేయాలి
- పనులు చేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు జాగ్రత్తలు పాటించాలి. హెల్మెట్, స్టీల్ టోడ్ బూట్లు, ఫేస్ స్క్‌లు వంటివి ధరించాలి
- పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్ ఉంచాలి
- విద్యుత్ లైన్లు ఎక్కడ పడితే అక్కడ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- అగ్నిప్రమాదాలు, ఇతర సందర్భాల్లో అత్యవసర నిష్క్రమణ ప్రణాళికలు రూపొందించాలి
- పాఠశాల ఆవరణలో గుంతలన్నీ పూర్తిగా పూడ్చివేయాలి. ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి
- ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని ఫొటోలతో సహా విద్యా శాఖకు నివేదికలు పంపించాలి
Published date : 05 Jul 2023 05:55PM