Department of Technical Education: మరింత మెరుగ్గా సాంకేతిక విద్యాశాఖ వెబ్‌సైట్
Sakshi Education
సాక్షి, అమరావతి: విద్యార్థులకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉండేలా సాంకేతిక విద్యాశాఖ నూతన వెబ్‌సైట్‌ను రూపొందించామని ఆ శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
మరింత మెరుగ్గా సాంకేతిక విద్యాశాఖ వెబ్‌సైట్
స్క్రీన్ రీడర్లను ఉపయోగించడం ద్వారా దృష్టి లోపం ఉన్నవారు సైతం చదవగలిగేలా కొత్త వెబ్‌సైట్‌లో కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సాంకేతిక విద్యాశాఖ కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను జూలై 3న గుంటూరు జిల్లా మంగళగిరిలోని కమిషనరేట్‌లో ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ.. నూతన వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను సైతం ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు. సూచనల ఆధారంగా వెబ్‌సైట్‌లో అవసరమైన మార్పులు చేస్తామని తెలిపారు.