Skip to main content

JNTU: జేఎన్‌టీయూకు జాతీయ స్థాయి గుర్తింపు

National level recognition for JNTU

అనంతపురం: జేఎన్‌టీయూ(అనంతపురం)కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. రాష్ట్రంలో సాంకేతిక విద్య అందిస్తున్న కళాశాలల్లో విద్య, వసతులపై ఇటీవల ‘నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) బృందం తనిఖీలు నిర్వహించింది. కళాశాలలో మౌలిక వసతులతో పాటు ఇతర అంశాలను జాతీయ స్థాయి బృందం క్షుణంగా పరిశీలించింది. కళాశాలల్లో అమలు చేస్తున్న కోర్సులు, ల్యాబ్స్‌ను తనిఖీ చేసింది. అధ్యాపకుల బోధనా పద్ధతులు, వారి విద్యార్హతలను ఆరా తీసింది. కళాశాలలో విద్యార్థులకు అందించే సాంకేతిక విద్య(టెక్నికల్‌ స్టాండర్స్‌), సాంకేతిక విద్యామండలి నివేదికల ప్రకారం తరగతుల నిర్వహణ, కళాశాలలో అమలు చేస్తున్న అకడమిక్‌ ఫలితాలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిశీలించి తుది నివేదికను ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లి జేఎన్‌టీయూ (ఏ)లోఉని సివిల్‌, కెమికల్‌ విభాగాలకు ఎన్‌బీఏ గుర్తింపునిచ్చింది. సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు ఎన్‌బీఏ గుర్తింపు దక్కడంపై జేఎన్‌టీయూ (ఏ) వీసీ ఆచార్య జింకా రంగజనార్ధన, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌బీఏ గుర్తింపుతో కళాశాలకు జాతీయ స్థాయిలో కీర్తి దక్కిందన్నారు.

చ‌ద‌వండి: AP CM YS Jagan Mohan Reddy : సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన‌ సివిల్స్ ర్యాంక‌ర్లు.. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారంటే..

మూడేళ్ల పాటు గుర్తింపు..

జేఎన్‌టీయూ(ఏ)కు దక్కిన నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) గుర్తింపు మూడేళ్ల పాటు కొనసాగనుంది. క్యాంపస్‌ కళాశాలలో నాణ్యమైన విద్యాబోధనకు గుర్తింపుగా ఇప్పటికే పలుమార్లు ఎన్‌బీఏ ధ్రువీకరణను జేఎన్‌టీయూ(ఏ) దక్కించుకుంది. గతంలో ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగాలకు ఎన్‌బీఏ గుర్తింపు వచ్చింది. తాజాగా తాజాగా సివిల్‌, కెమికల్‌ విభాగాలకు గుర్తింపు దక్కడంతో ఆ సంఖ్య నాలుగు నుంచి ఆరుకు చేరుకుంది. కాగా, జేఎన్‌టీయూ(ఏ)లోనే అత్యంత పురాతన విభాగంగా ఖ్యాతిగాంచిన సివిల్‌ ఇంజినీరింగ్‌కు వరుసగా ఐదు దఫాలుగా ఎన్‌బీఏ గుర్తింపు దక్కడం గమనార్హం. నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అత్యాధునిక ప్రయోగశాలలు, లర్నింగ్‌ బై డూయింగ్‌ విధానంలో బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగడంతో జేఎన్‌టీయూ (ఏ)లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు.
విద్య, బోధనలో నాణ్యత ప్రమాణాలు ఉంటేనే ఎన్‌బీఏ గుర్తింపు దక్కుతుంది. ఎన్‌బీఏ గుర్తింపు దక్కిన కోర్సులపై మూడేళ్లపాటు సాంకేతిక విద్యామండలి ప్రత్యేక దృష్టి పెడుతుంది. భవిష్యత్‌లో కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందజేస్తుంది. ఏటా కళాశాలలో ఉన్నత స్థాయి కంపెనీలతో జాబ్‌మేళాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులు, నిధులు మంజూరుకు అవకాశం ఏర్పడుతుంది. ఫ్యాకల్టీ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక ఓరియంటేషన్‌ శిక్షణ అందుతుంది. సాధారణంగా పరీక్షలు రాశాక మార్కులను బట్టి డిగ్రీలు అందజేస్తారు. అయితే ఎన్‌బీఏ గుర్తింపు తర్వాత అవుట్‌ కమ్‌ బేస్డ్‌ పరీక్షలు రాసి, ఉద్యోగంలో స్థిరపడిన ఐదేళ్ల వరకూ సదరు విద్యార్థిపై పరిశీలన ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం రాకుంటే నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. పారిశ్రామిక రంగంపై ఆసక్తి ఉంటే అందుకు తగ్గనట్లుగా విద్యార్థులను సంసిద్ధం చేస్తారు. 100 మంది అడ్మిషన్లు పొందితే వారందరూ జీవితంలో స్థిరపడేలా ఎప్పటికప్పుడు ఐదేళ్ల పాటు పరిశీలన ఉంటుంది.
సివిల్‌, కెమికల్‌ విభాగాలకు ఎన్‌బీఏ ధ్రువీకరణ నాణ్యమైన విద్యాబోధనకు దక్కిన ప్రతిఫలం కంపెనీ అవసరాలకు తగిన మానవ వనరుల ఉత్పత్తికి దోహదం ఎన్‌బీఏ గుర్తింపుతో చేకూరే ప్రయోజనాలు..

Published date : 23 Jun 2023 06:50PM

Photo Stories