Acharya D Narayana Rao: టెన్త్‌లో మెరిట్ విద్యార్థికి నగదు బహుమతి
Sakshi Education
సాక్షి,పాడేరు: కిల్లోగుడ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో టెన్త్ కామన్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థికి ఏటా రూ.20 వేల నగదు బహుమతిని అందజేస్తానని ఇస్రో పూర్వ డైరెక్టర్, ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిసెర్చ్) ఆచార్య డి.నారాయణరావు ప్రకటించారు.
సెప్టెంబర్ 25న ఆయన అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పర్యటించారు. దీనిలో భాగంగా కిల్లోగుడ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. అత్యధిక మార్కులు సాధించే దిశగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే నగదు బహుమతి పంపిణీకి నిర్ణయం తీసుకున్నామన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
ప్రభుత్వం గిరిజన విద్యకు అందిస్తున్న సౌకర్యాలు, వసతులను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు కూడా అన్ని సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్యాబోధన అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లకే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Published date : 26 Sep 2023 03:42PM