Skip to main content

Tenth Class: మూల్యాంకన కేంద్రాల్లో మెరుగైన వసతులు.. ఇసారి ఇలా..

సాక్షి అమరావతి/నరసరావుపేట ఈస్ట్‌/గుంటూరుఎడ్యుకేషన్‌/బాపట్ల అర్బన్‌: పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వాల్యూయేషన్‌) కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.
Tenth Class
నరసరావుపేటలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ప్రకాష్‌

ఏప్రిల్‌ 26వ తేదీతో మూల్యాంకనం పూర్తవుతుందన్నారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఏప్రిల్ 23న‌ ఆయన గుంటూరులోని నగరంపాలెం స్టాల్‌ గల్స్‌ హైస్కూల్, పల్నాడు జిల్లా నగరసరావుపేటలోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్, బాపట్ల మున్సిపల్‌ పాఠశాలలో కొనసాగుతున్న స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నరసరావుపేటలోని స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచడంపై డీఈవో కె.శామ్యూల్‌ను అభినందించారు.

చదవండి: Inter & Tenth Class: ఫలితాలు సమాచారం

ఇతర సీనియర్‌ అధికారులు కూడా వివిధ జిల్లాల్లోని కేంద్రాలను పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. బాపట్ల మూల్యాంకనం కేంద్రంలో మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, వాల్యూయేషన్‌ ఏప్రిల్‌ 19న ప్రారంభమైన విషయం తెలిసిందే. పరీక్షలకు 6,64,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారు రాసిన 45 లక్షల జవాబు పత్రాలను వివిధ కేంద్రాల్లో 25,000 మంది ఉపాధ్యాయులు వాల్యూయేషన్‌ చేస్తున్నారు.  

చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

మంత్రి బొత్స పరిశీలన 

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం, విజయనగరంలోని కొన్ని స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. వాటిలో చాలా కేంద్రాలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, ఇవి ప్రస్తుత అవసరాల మేరకు స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాలుగా ఎంపిక చేయడానికి ఉత్తమమైనవి కావన్నారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల ఏర్పాటుపై కొత్త పాలసీని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చదవండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

Published date : 24 Apr 2023 05:48PM

Photo Stories