School Opening: గురుకుల పాఠశాల ప్రారంభం
ఏప్రిల్ 14న మండల పరిధిలోని కొర్రపాడులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రూ.13 కోట్లతో నిర్మించిన అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి ముందుగా బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల బాలికల పాఠశాల నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించారన్నారు. మేమే గొప్ప. అంటూ.... కల్లిబొల్లి ప్రచారాలు చేసుకునే టీడీపీ ప్రభుత్వం పాఠశాల నిర్మాణానికి రూ.2 కోట్లు ఖర్చు పెట్టి చేతులు దులుపుకుందన్నారు.
చదవండి:
‘World Quantum Day’కు ట్రిపుల్ ఐటీ శాస్త్రవేత్తలు
Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
ఇంటర్ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన
గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో 450 మంది బాలికలు వసతి గృహం లేక నరకయాతన అనుభవించారని తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో పంగల్ రోడ్డులో అద్దె భవనంలో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులను కొర్రపాడు ఎస్‌ఎస్‌ఏ ట్రైనింగ్ సెంటర్‌లోకి మార్పించామన్నారు. 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాల భవన నిర్మాణాన్ని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీఎం జగనన్నతో చర్చించి పెండింగ్‌లో ఉన్న 90 శాతం బిల్లులు మంజూరు చేయించామని తెలిపారు. విద్యా సంక్షేమానికి సీఎం వైఎస్ జగనన్న ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ భాస్కర్ జ్ఞాపికను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో నాటక అకాడమీ చైర్‌పర్సన్ చాలమూరు హరిత, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్మమ్మ, ఎంపీపీలు సునీత, లోకేశ్వరి, సర్పంచ్ నాగలక్ష్మి, పార్వతి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.