Skip to main content

Admissions: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే

అనంతపురం ఎడ్యుకేషన్‌: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Applications for admissions in KGBVs

 6, 11వ తరగతుల్లో ప్రవేశానికి, 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ వరలక్ష్మీ, సమగ్ర శిక్ష ఏపీసీ వరప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు.

అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్‌ (బడి మానేసిన పిల్లలు) నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్‌ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

చదవండి: Students Education: పాఠశాల తనిఖీలో ఉపాధ్యాయులకు సూచన..!

https://apkgbv.apcfss. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంిపికై న విద్యార్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీఈ టోల్‌ఫ్రీ నంబరు 18004258599కు కాల్‌ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Published date : 11 Mar 2024 12:45PM

Photo Stories