Skip to main content

AP 10th Class: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. సప్లిమెంటరీ పరీక్షల్లో..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ap 10th class supplementary exams
ap 10th class supplementary exams

అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్‌ 7వ తేదీ(మంగ‌ళ‌వారం) నుంచి 20వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. రూ.50 ఆలస్యరుసుంతో జూన్‌ 21వ తేదీ నుంచి ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీకి ఒక రోజుముందు వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. 

సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా..
కరోనా కారణంగా చదువులు సరిగా ముందుకు సాగక విద్యార్థులు  కొంత నష్టపోయిన నేపథ్యంలో వారికి ఊరట కల్పించేలా ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా వారిని కంపార్టుమెంటల్‌ పాస్‌ కింద కాకుండా పరీక్షలో ఆయా విద్యార్థులు సాధించే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లను కేటాయించనున్నామని మంత్రి వివరించారు.

☛ ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కులకు సంబంధించి షార్ట్‌ మెమోలను రెండు రోజుల అనంతరం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. ఈ మెమోల ద్వారా విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు పొందవచ్చు.
☛ ఫెయిలైన వారి వివరాలను జూన్ 7వ తేదీన (మంగళవారం) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది.
☛ విత్‌హెల్డ్‌లో ఉన్న వారి ఫలితాలను ఆయా జిల్లాలనుంచి సమాచారం అందిన అనంతరం ప్రకటించనున్నారు.  
☛ రీ కౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 
☛ రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్‌ కాపీల కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున జూన్ 20వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. 
☛ రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసేవారు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రీ వెరిఫికేషన్‌లో మార్కుల రీ కౌంటింగ్‌తో పాటు సమాధానాలు రాసిన అంశాలన్నిటికీ మార్కులు వేశారా? లేదా? అనేది పరిశీలన చేస్తారు. ఒకవేళ ప్రశ్నలకు సమాధానాలు రాసినా వాటికి మార్కులు ఇవ్వకుంటే ఆ ప్రశ్నల సమాధానాలను రీ వాల్యుయేషన్‌ చేసి మార్కులు కేటాయిస్తారు. రీ వెరిఫికేషన్లో ఆయా సమాధానాల రీ కరెక్షన్‌కు అవకాశం ఉండదు. అలాంటి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు.

ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Published date : 07 Jun 2022 12:35PM

Photo Stories