Skip to main content

AP 10th Class Public Exams 2022–23 : టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఏఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంద్రప్రదేశ్‌లో 2022–23 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించనున్నారు.
AP 10th class 2023 blue print

ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఆరు పేపర్లకు సంబంధించి స‌బ్జెక్ట్ వైజ్ మోడ‌ల్ పేప‌ర్లుల‌తో పాటు.. ఏఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు రానున్నాయో తెలియ‌జేస్తూ.. ఒక బ్లూప్రింట్‌ను కూడా పాఠశాల విద్యాశాఖ విడుద‌ల చేసింది.

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఏపీ టెన్త్ క్లాస్‌ స‌బ్జెక్ట్ వైజ్ మోడ‌ల్ పేప‌ర్లు & మార్కుల వివ‌రాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

SSC PUBLIC EXAMINATIONS-2023 SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS ( Click Here )

ఆరు పేప‌ర్లు తగ్గింపుకు కారణం ఇదేనా..?
టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు తొలుత 11 పేపర్లతో ప్రారంభమై ఇప్పుడు ఆరుకు తగ్గాయి. గతంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లో లేనప్పుడు 11 పేపర్లలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు జరిగేవి. ఆ పరీక్షలకు ముందు నాలుగు యూనిట్‌ టెస్టులు, రెండు టర్మ్‌ టెస్టులు నిర్వహించేవారు. సీసీఈ విధానానాన్ని ముందుగా 8వ తరగతి వరకే అమల్లోకి తెచ్చినప్పటికీ.. ఆ తర్వాత 9, 10 తరగతులకూ వర్తింపచేశారు. సీసీఈ విధానంలో విద్యార్థులకు నాలుగు ఫార్మేటివ్‌ పరీక్షలు, రెండు సమ్మేటివ్‌ పరీక్షలను నిర్వహించేవారు. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలతో సీసీఈ విధానం అమలు చేశారు.

10th Class Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..
 
విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షల్లో మరింత నిశితంగా పరీక్షించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాల విద్యా శాఖకు నివేదికను సమర్పించింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు సీబీఎస్‌ఈ.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహిస్తోందని నివేదించింది. దీన్ని అనుసరించి రాష్ట్రంలో కూడా ఆరు లేదా ఏడు పేపర్లలో నిర్వహిస్తే సరిపోతుందని తెలిపింది. దీంతో ప్రభుత్వం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.

What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం

Published date : 22 Sep 2022 06:16PM

Photo Stories