Department of Education: పాఠశాలల్లో ఇలాంటి కార్యకలాపాలు చేపడితే చర్యలు
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించింది.
పాఠశాలల్లో ఇలాంటి కార్యకలాపాలు చేపడితే చర్యలు
ఈ మేరకు కమిషనర్ సురేష్ కుమార్ డీఈవోలకు సమాచారం పంపారు. కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాలల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, సమావేశాల పేరిట నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ పేర్కొన్నారు. ఇటువంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని, నిబంధనలకు వ్యతిరేకమైన ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై రూల్సు ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.