మూడో ఏడాదీ నష్టపోతే ఇక పిల్లల చదువులు ఏం కావాలి?: సీఎం
ఆందోళనకు దిగుతున్న వారు తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మూడో ఏడాదీ చదువులను గాలికి వదిలేస్తారా? అని మండిపడ్డారు. రెచ్చగొట్టే నాయకులు, ఎల్లో మీడియా వీళ్లంతా నిజంగా మనుషులేనా? అని ధ్వజమెత్తారు. ఇంత మంచి చేస్తున్నా ప్రభుత్వంపై బురదజల్లడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ధర్మమేనా? అని ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. జగనన్న చేదోడు పథకం ద్వారా ఫిబ్రవరి 8న లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. గత రెండేళ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు గణనీయంగా వేతనాల పెంపుతో పాటు నిరుద్యోగ యువతకు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల వివరాలను ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
చదవండి:
JNU: తొలి మహిళా వీసీగా తెలుగు బిడ్డ
Intermediate: ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు.. పరీక్షల తేదీల ఇవే..
Intermediate: ఉద్యోగం, ఉపాధి అందించే కోర్సులు.. ప్రతినెలా ఉపకార వేతనం..