Skip to main content

మొక్కజొన్నలో పోషకాలెన్నో..!

Tenth Classవర్షాకాలం రాగానే మొక్కజొన్న కంకులు వచ్చేస్తాయి. లేతమొక్కజొన్న కండెలు నిప్పుల మీద కాల్చుకుని తింటే రుచిగా ఉంటాయి.

100 గ్రాముల మొక్కజొన్నలో 24.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4.7 గ్రాముల ప్రోటీన్లు, 0.9 గ్రాముల కొవ్వులు, 1.9 గ్రాముల పీచుపదార్థం, 9 మిల్లీగ్రాముల క్యాల్షియం, 121 మి.గ్రా. ఫాస్పరస్, 11 మి.గ్రా. ఐరన్, 0.6 మి.గ్రా నియాసిన్, 0.11 మి.గ్రా. థయామిన్, 0.17 మి.గ్రా. రిబోఫ్లవిన్, 6 మి.గ్రా. విటమిన్ సి, 32 మైక్రో గ్రాముల కెరోటిన్, 125 క్యాలరీల శక్తి ఉంటాయి.

మొక్కజొన్న గింజల్లో ముఖ్యంగా ‘జెయిన్’ అనే ప్రోటీన్ ఉంటుంది. దీంతోపాటు ఆల్బుమిన్, గోబ్యులిన్, ప్రొలామైన్, గ్లూటెలిన్ మొదలైన ప్రోటీన్లూ ఉంటాయి.

మొక్కజొన్నతో తయారుచేసే వంటనూనెలో ‘ప్యూఫా’ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.

మొక్కజొన్న నూనెలో ‘విటమిన్ ఇ’ కూడా ఎక్కువ శాతం వుంటుంది. మొక్కజొన్న గింజల్లో ఐరన్, ఫాస్ఫరస్ ఎక్కువగానే ఉంటాయి. మొక్కజొన్న కండెలో తెల్లగా మెత్తగా పట్టులాగ ఉండే పోగులు వుంటాయి. దీన్ని ‘కార్న్ సిల్క్’ అంటారు. టీ ఆకులలాగ కార్న్‌సిల్క్‌తో కార్న్ టీ తయారు చేసుకోవచ్చు. ఇది బీపీ తగ్గిస్తుంది.
Published date : 13 Nov 2013 10:58AM

Photo Stories