మన శరీరానికి వేడి ఎలా వస్తుంది?
Sakshi Education
సృష్టిలో కొన్ని శీతల రక్త జీవులు. కొన్ని ఉష్ణరక్త జీవులు ఉంటాయి. మానవులు ఉష్ణరక్త జీవులు. మానవుల శరీర ఉష్ణోగ్రత దాదాపుగా స్థిరంగా ఉంటుంది. బాహ్యవాతావరణ ప్రభావం వల్ల శరీర ఉష్ణోగ్రత మారదు. ఆరోగ్య వంతులైన మానవుల శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు ఫారన్‌హీట్ ఉంటుంది. మనం రోజూ తీసుకునే ఆహారం నుంచి మన శరీరం ఉష్ణశక్తిని గ్రహిస్తుంది. ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెందడం ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఆహారం ఆక్సీకరణం చెందేటప్పుడు ఉష్ణం మాత్రమే పుడుతుంది. మానవుల శరీరంలో ప్రతిరోజు 2500 కాలరీలు ఉష్ణ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ ఉష్ణశక్తి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను మెదడులోని ఉష్ణోగ్రత కేంద్రం చేత అదుపు చేస్తుంది.
Published date : 23 Dec 2013 04:53PM