Skip to main content

ఓజోన్ వాయువు అంటే ఏమిటి?

Tenth Classఆక్సిజన్ యొక్క ఒక రూపాంతరం ఓజోన్ వాయువు. ఓజోన్‌లో కూడా ఆక్సిజన్ పరమాణువులే వున్నప్పటికీ వాటి సంఖ్య, అమరిక పద్ధతి వేరుగా వుంటాయి.

లేత నీలంరంగులో ఘాటైన వాసనగల వాయువు ఓజోన్. ఆక్సిజన్ కంటే భిన్నమైన రసాయనిక లక్షణాలు గల విషవాయువు ఇది.

వాతావరణంలో చాలా చిన్న చిన్న మొత్తాలలో ఓజోన్ వాయువు వుంటుంది. ఆక్సిజన్ మీద అతినీలలోహిత కిరణాల (అల్ట్రావయొలెట్ రేస్) చర్య కారణంగా ఓజోన్ వాయువు ఏర్పడుతుంది. ఓజోన్ వాయువు ఎత్తయిన స్థలాలలో సాంద్రంగా వుంటుంది. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు నేరుగా మనలను తాకకుండా ఓజోన్‌పొర మనలను రక్షిస్తుంది. అయితే వాతావరణంలో కాలుష్యం, రసాయనిక పొగలు పెరిగిపోతే ఓజోన్ పొరకు చిల్లు పడి మనకు ప్రమాదం ఏర్పడుతుంది. ఓజోన్ వాయువును ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయవచ్చు. ఒక గొట్టంలోకి ఆక్సిజన్‌ను పంపి, దాన్ని విద్యుదీకరించడం ద్వారా ఓజోన్ వాయువును తయారుచేయవచ్చు. ఓజోన్ వాయువు శక్తిమంతమైన వాయువు. నీటిలోని సూక్ష్మక్రిములను చంపడానికి, గాలిని శుభ్రపరచడానికి, ఆహారపదార్థాల రంగును పోగొట్టడానికి, ఆహార నిల్వలలో బ్యాక్టీరియా పెరగకుండా చేయడానికి, కొన్ని మందుల తయారీలో ఓజోన్ వాయువును వాడతారు.
Published date : 13 Nov 2013 11:04AM

Photo Stories