Skip to main content

మనం ఎంత దూరాన్ని చూడగలం?

Tenth Classమనం నిలబడిన ప్రదేశాన్ని బట్టి మనం ఎంత దూరాన్ని మామూలు కళ్లతో చూడగలం అనేది ఆధారపడివుంటుంది. (బైనాక్యులర్ వంటి వాటితో ఎక్కువ దూరం చూడగలం) సముద్రతీరంలో నిలబడి సముద్రం వైపు చూస్తే దూరంగా భూమి, ఆకాశం కలిసినట్లు కనబడుతుంది. అంటే సుమారు 4 కిలోమీటర్ల దూరాన్ని చూడగలం అన్నమాట.

ఆరుమీటర్ల ఎత్తువుండే ప్రదేశంలో నిలబడితే 10 కిలోమీటర్ల దూరం వరకూ చూడవచ్చు. మనం నిలబడే ప్రదేశం ఎత్తు పెరిగేకొద్దీ మనం ఎక్కువ దూరం చూడగలుగుతాం. భూమి గుండ్రంగా ఉండటం వల్ల మనం నిలబడే ఎత్తు సముద్రమట్టం నుండి పెరిగేకొద్దీ ఎక్కువదూరం భూమిని చూడగలుగుతాం.

అదే ఆకాశం వంక చూసినపుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కొన్ని లక్షల, కోట్ల మైళ్ల దూరంలో ఉన్నా చూడగలం. అయితే భూమి గుండ్రంగా ఉన్నందున మనం భూమిపై కొన్ని కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం చూడలేం.
Published date : 13 Nov 2013 10:27AM

Photo Stories