Skip to main content

కస్తూరి మృగాలు ఎక్కడ ఉంటాయి?

Tenth Classసైబీరియా నుంచి హిమాలయాల వరకు ఉన్న పర్వత ప్రాంతాలలో కస్తూరిమృగాలు నివసిస్తుంటాయి. ఇవి లేడి జాతికి చెందినవి. సుగంధభరితమైన కస్తూరిని విడుదల చేయడం వీటి ప్రత్యేకత. అందువల్లనే వీటిని కస్తూరి మృగం (Musk Deer) అంటారు.

లేళ్లకు తల మీద మెలికలు తిరిగిన కొమ్ములు ఉన్నా, అదే జాతికి చెందిన కస్తూరి మృగాలకు కొమ్ములు ఉండవు. ఆకారంలో కూడా ఇవి కొంచెం చిన్నవిగా వుంటాయి.
వీటికి పెద్ద చెవులు ఉంటాయి. తోక చాలా చిన్నదిగా ఉండీ లేనట్టు ఉంటుంది. శరీరం ముందు భాగం కంటే వెనుక భాగం కొంచెం ఎత్తుగా ఉంటుంది. ముందు కాళ్లు నిటారుగా, వెనుక కాళ్లు కొంచెం వంగి ఉంటాయి.

మగ కస్తూరి మృగానికి పైదంతాలు రెండు పెద్దవిగా కిందికి వచ్చి ఉంటాయి. కస్తూరి మృగాలు ఉత్పత్తిచేసే కస్తూరి ఒక సుగంధద్రవ్యం. మగ కస్తూరి మృగాల పొట్ట అడుగున నాభి దగ్గర ఉండే సంచుల వంటి అరలలో కస్తూరి ఉత్పత్తి అవుతుంది. తాజాగా ఉత్పత్తి అయినపుడు కస్తూరి కొంచెం పలచగా, ద్రవంలాగ ఉంటుంది. కొంతకాలానికి అది బిగుసుకుని గట్టిగా తయారవుతుంది.
Published date : 13 Nov 2013 11:01AM

Photo Stories