UPSC Topper: యూపీఎస్సీ టాపర్‌పై 'ఆనంద్ మహీంద్రా' ప్రశంసల జల్లు!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన ఆదిత్య శ్రీవస్తవను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

ఈ జాబితాలో దేశీయ దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు.

ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేసి, 12th పెయిర్ సినిమా చూసిన తరువాత యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తనను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. ఆదిత్యకు అభినందనలు తెలిపి, "మీరు మీలాంటి మరెందరో మన దేశాన్ని ముందుకు సాగేలా చేయగలరు" అని ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో 13,000 కంటే ఎక్కువ లైక్స్ పొందింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

"40 లక్షల ప్యాకేజీ వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వెళ్లడం దమ్మున్న విషయం. చాలామంది యువత మీ స్ఫూర్తిని తీసుకుంటారు" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

UPSC Topper List 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌–3 వీరే.. టాప్‌–25 ర్యాంకర్లలో ఎంత మంది మహిళలు ఉన్నారో తెలుసా!!

 

 

#Tags