ESI Recruitment 2024: 1,930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మ‌రో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌(ESIC)లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://upsc.gov.in/ వెబ్‌సైట్ సంప్ర‌దించండి.  

పోస్టుల సంఖ్య: 1930

 

కేటగిరీ పోస్టుల సంఖ్య
  అన్‌రిజర్వ్‌డ్‌    892
  ఈడబ్ల్యూఎస్‌   193
  ఓబీసీ   446
  ఎస్సీ   235
  ఎస్టీ   164
  దివ్యాంగులు   168

అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. లేదా డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ). స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం ఉండాలి.

APPSC Notification: గుడ్‌న్యూస్‌.. ఏపీలో నాలుగు ప్ర‌భుత్వ‌ ఉద్యోగ నోటిఫికేషన్లు

వయో పరిమితి:
27-03-2024 నాటికి జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30, ఓబీసీ అభ్యర్థులకు 33, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35, దివ్యాంగ అభ్యర్థులకు 40 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు:
కేవ‌లం రూ.25, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.  

ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Sub Inspector Jobs: 4,187 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు..

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 7, 2024
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27, 2024
దరఖాస్తుల సవరణ తేదీలు: మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 3 వరకు
రాత పరీక్ష తేదీ: జులై 7, 2024

#Tags