Skip to main content

Sub Inspector Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 4,187 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024 (SI 2024) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Notification for SI Recruitment Exam 2024  SSC CPO 2024 Notification Out for 4187 Posts   Delhi Police emblem for SI Recruitment Exam 2024

ఈ పరీక్ష ద్వారా 4,187 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

మొత్తం ఖాళీలు: 4187

సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్(CAPF)​ : 4001 సబ్​-ఇన్​స్పెక్టర్ (జీడీ)​ పోస్టులు

దిల్లీ పోలీస్ (పురుషులు)​ : 125 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​) పోస్టులు

దిల్లీ పోలీస్ (మహిళలు)​ : 61 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​) పోస్టులు

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ
  • నిర్దిష్ట శారీరక ప్రమాణాలు

వయోపరిమితి:

  • 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు.

జీత భత్యాలు:

  • నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వ‌ర‌కు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • సీబీటీ రాత పరీక్ష
  • శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌టీ)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
  • ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే..

  • గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Government Job Notifications: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే..

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 4, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 28, 2024
  • దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 28, 2024
  • దరఖాస్తుల సవరణకు తేదీలు: మార్చి 30 నుంచి 31 వరకు
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: మే 9, 10, 13

పూర్తి వివరాల కోసం https://ssc.gov.in/  వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

Published date : 09 Mar 2024 11:16AM
PDF

Photo Stories