APPSC, TSPSC గ్రూప్స్ లో Mental Ability నుంచి 16-20 ప్రశ్నలు... టాప్‌ స్కోర్‌ సాధించడమెలా?

Mental Ability Logical Reasoning, Arithmetic, Data Interpretation preparation tips important topics

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్స్‌ రానున్నాయి. నిరుద్యోగ యువత తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. రెండు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్‌లలో గ్రూప్‌–1, గ్రూప్‌–2లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇవేకాకుండా.. టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్‌ ఏదైనా సరే.. అందులో తప్పకుండా ఉండే పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. ఈ జీఎస్‌ పేపర్‌లో కచ్చితంగా కనిపించే  ముఖ్యమైన అంశం.. లాజికల్‌ రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌. ఈ విభాగంలో టాప్‌ స్కోర్‌ సాధించడమెలాగో తెలుసుకుందాం... 

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో 150 ప్రశ్నలకు దాదాపు 16–20 ప్రశ్నల వరకు లాజికల్‌ రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ టాపిక్‌ నుంచే వస్తాయి. ఇందులో రీజనింగ్‌పై అధికంగా ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు ప్రశ్నలు మాత్రమే అర్థమెటిక్‌ నుంచి వస్తాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగా రీజనింగ్‌పై దృష్టిపెట్టడం మేలు. జనరల్‌ స్టడీస్‌లో.. మెంటల్‌ ఎబిలిటీ నుంచి వచ్చే ప్రశ్నలను మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అవి..(1)సంఖ్యల ఆధారిత ప్రశ్నలు, (2)ఆంగ్ల ఆధారిత ప్రశ్నలు, (3) ఇతర ప్రశ్నలు.

చ‌ద‌వండి:  Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

సంఖ్యల ఆధారిత ప్రశ్నలు

ముందుగా సంఖ్యల ఆధారిత ప్రశ్నలు పరిశీలిస్తే.. ఇందులో అర్థమెటిక్‌లోని అన్ని అంశాలు, రీజనింగ్‌లో నంబర్‌ సిరీస్, నంబర్‌ అనాలజీ (సంఖ్యల పోలిక పరీక్ష), నంబర్‌ క్లాసిఫికేషన్‌(సంఖ్యల భిన్న పరీక్ష) వస్తాయి. ఇవి వేగంగా చేయాలంటే.. అభ్యర్థులు ముందుగా కింది వాటిపై దృష్టి పెట్టాలి. అవి..

ప్రాథమిక సంఖ్యావాదం

అభ్యర్థులు వివిధ రకాల సంఖ్యల గురించి అవగాహన పెంచుకోవాలి. సహజ సంఖ్యలు, పుర్ణాంకాలు, పూర్ణసంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, ప్రధానాంకాలు, సరిసంఖ్యలు, బేసి సంఖ్యలపై పరిజ్ఞానం ఉండాలి. పోటీ పరీక్షల కోసం నిర్వచనాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాని వీటిపై కనీస అవగాహన ఉండాలి.

భాజనీయత సూత్రాలు

1 నుంచి 11 వరకు భాజనీయత సూత్రాలు తెలిసుండాలి. భాజనీయత సుత్రాలు అంటే.. భాగాహారం చేయకుండానే ఇచ్చిన సంఖ్య 2,3,4...11లతో భాగించబడు తుందో లేదో చెప్పగలగాలి. ఈ సూత్రాలు తెలిసుంటే.. నంబర్‌ అనాలజీ, నంబర్‌ క్లాసిఫికేషన్‌ ప్రశ్నలు వేగంగా చేయగలుగుతారు.

1 నుంచి 60 వరకు వర్గాలు, 1 నుంచి 20 వరకు ఘనాలు

పరీక్షలో వర్గాలను, ఘనాలను నేరుగా అడగరు. కాని నంబర్‌ సిరీస్, నంబర్‌ అనాలజీ, నంబర్‌ క్లాసిఫికేషన్‌లలో కొన్ని ప్రశ్నలు వర్గాలు, ఘనాల మీద ఆధారపడతాయి. కాబట్టి ఇవి తెలిస్తే ప్రశ్నలు త్వరగా చేయవచ్చు. అదేవిధంగా పైన చెప్పినంత వరకు వర్గాలు, ఘనాలు నేర్చుకుంటే.. కొన్ని గణనలు వేగంగా చేయగలుగుతారు.

1 నుంచి 20 వరకు ఎక్కాలు

పోటీ పరీక్షల అభ్యర్థులకు  1 నుంచి 20 వరకు ఎక్కాలు తెలుసుండాలి. వేద గణిత చిట్కా ద్వారా.. కేవలం రెండు నిమిషాల్లోనే 11 నుంచి 20 వరకు ఎక్కాలు నేర్చుకోవచ్చు. ఈ వేదగణిత చిట్కాలను రోజుకొకటి చొప్పున ..అన్ని చిట్కాలు అందించే ప్రయత్నం చేస్తాను.

100లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు

అభ్యర్థులు 100లోపు ఉన్న ప్రధాన సంఖ్యలపై పట్టు పెంచుకోవాలి. 5వ తరగతి గణిత పుస్తకంలో ఎరటోస్తనీస్‌ జల్లెడ పద్ధతిలో.. ప్రధాన సంఖ్యలు కనుగొనే విధానాలు ఇచ్చారు.దానికంటే సులభమైన మరో పద్ధతి ద్వారా.. ప్రధాన సంఖ్యలను ఎలా తెలుసుకోవాలో వచ్చే ఆర్టికల్స్‌లో వివరిస్తాను.

చాతుర్విద గణిత పరిక్రియలు

కూడిక (+), తీసివేత (–), గుణకారం (×), భాగాహారం (/) అందరికీ తెలుసు. కాని వీటిని వేగంగా చేయగలగాలి. గణనలు వేగంగా చేయాలంటే.. ఒకే ఒక ఉత్తమమైన మార్గం వేద గణితం. ఈ వేద గణితం చిట్కాలు తదుపరి ఆర్టికల్స్‌లో అందించే ప్రయత్నం చేస్తాను.

చ‌ద‌వండి: APPSC/TSPSC Groups Exams: పాలిటీ నుంచి 25-30 ప్రశ్నలు... పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత, ప్రశ్నల స్థాయి–సరళి!​​​​​​​ 

సూత్రాలు

  • ఆర్థమెటిక్‌లో ప్రశ్నలు సాధించాలంటే.. సూత్రాలు కూడా వచ్చి ఉండాలి. 
  • మెంటల్‌ ఎబిలిటీలో వచ్చే ప్రశ్నలలో మరో విభాగం ఆంగ్ల అక్షరాలను ఆధారంగా చేసుకొని అడిగే ప్రశ్నలు. లెటర్‌ సిరీస్, లెటర్‌ అనాలజీ, లెటర్‌ క్లాసిఫికేషన్, కోడింగ్‌–డీకోడింగ్‌ అంశాలు.. ఆంగ్ల అక్షరాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగా కింది వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. 
  • A నుంచి Z వరకు, Z నుంచి A వరకు వేగంగా చేయగలగాలి.
  • A నుంచి Z వరకు స్థాన విలువలు తెలిసుండాలి. స్థాన విలువలు అనగా A-1, B-2, C-3 ....Y-25, Z-26
  • A నుంచి Z వరకు అక్షరాల తిరోగమన స్థాన విలువలు తెలిసుండాలి. తిరోగమన స్థాన విలువలు అంటే.. A చివర నుంచి 26 అక్షరం కాబట్టి A తిరోగమన స్థాన విలువ 26, A-26, B-25, .... Z-1
  • A నుంచి M వరకు అక్షరాల తిరోగమన స్థానాక్షరాలు తెలిసుండాలి. ఆంగ్లంలో 26 అక్షరాలు అంటే.. 13 జతల అక్షరాలు ఉన్నాయి. M అనేది 13వ అక్షరం. కాబట్టి A నుంచి M వరకు తిరోగమన స్థానాక్షరాలు నేర్చుకుంటే మిగిలినవి నేర్చుకున్నట్లే. తిరోగమన స్థానాక్షరాలు అంటే A-Z, B-Y, C-X... M-N
  • చివరగా ఆంగ్లంలోని అచ్చులు A,E,I,O,U. ఇవి దాదాపు అందరికి తెలిసినవే.
  • ఈ ఐదు అంశాలను బాగా సాధాన చేసినట్లయితే.. అక్షరాల ఆధారంగా అడిగే ప్రశ్నలను వేగంగా చేయవచ్చు.

సిల్లాయిజమ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌

  • చివరగా సంఖ్యల మీద ఆధారపడని ప్రశ్నలు. వీటికి ఆంగ్ల అక్షరాలతో సంబంధం ఉండదు. ఉదాహరణకు రక్త సంబంధాలు, సిల్లాయిజమ్, సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌ మొదలైనవి.

వేదగణిత చిట్కా

  • 1 నుంచి 60 వరకు వర్గాలు నేర్చుకోవాలి. అందులో భాగంగా ఈ రోజు 50 నుంచి 60 వర్గాలు నేర్చుకుందాం..
  • 50 నుంచి 60 వరకు వర్గాలు: 52=25 అని మీకు తెలిపిందే. 502 అంటే.. 25 పక్కన రెండు సున్నాలు రాయండి చాలు 502 = 2500. అదేవిధంగా 62 = 36 తెలిసిందే.. 602 అంటే 36 పక్కన రెండు సున్నాలు రాయాలి. 602 =3600.
  • ఇప్పుడు 51 నుంచి 59 వరకు వర్గాలు చుద్దాం.. 51 నుంచి 59 వరకు సంఖ్యల వర్గంలో నాలుగు అంకెలు ఉంటాయి. దీనిని రెండు భాగాలుగా విభజిస్తే.. మొదటి భాగంలో రెండు అంకెలు, రెండవ భాగంలో రెండు అంకెలు ఉంటాయి. మొదటి భాగంలో 25కు ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకెను కలిపి రాయాలి. రెండవ భాగంలో, ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె యొక్క వర్గం రాయాలి.

ఇప్పుడు 50 నుంచి 60 వర్గాలు చూద్దాం...

502 = 2500
512 = 25+1/12 = 2601
522 = 25+2/22 = 2704
532 = 25+3/32 = 2809
542 = 25+4/42= 2916
552 = 25+5/52 = 3025
562 = 25+6/62 = 3136
572 = 25+7/72 = 3249
582 = 25+8/82 = 3364
592 = 25+9/92 = 3481
602 = 3600

  • త్వరలో నోటిఫికేషన్స్‌ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించండి. ఆర్థమెటిక్, రీజనింగ్‌ కోసం కనీసం వారానికి నాలుగు గంటలు కేటాయించండి. తద్వారా జీఎస్‌లో మంచి స్కోర్‌కు అవకాశం ఉంటుంది. 

 – బండ రవిపాల్‌ రెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!

#Tags