TS TET Exam Instructions 2023 : టెట్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీఎస్‌ టెట్ ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన(శుక్ర‌వారం) జరుగనున్నది. ఈ ప‌రీక్ష కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లల‌ను పూర్తి చేసింది. ఈ టెట్ ప‌రీక్ష‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగనున్నది.
TS TET Exam Instructions 2023 Details

ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఆ ప‌రీక్ష కేంద్రాల్లో విద్యాశాఖ‌ స్కూల్స్‌కు సెల‌వును ప్ర‌క‌టించారు.

టెట్‌లో అర్హత సాధించినవారికే డీఎస్సీ, గురుకుల లాంటి వివిధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు అర్హులు కావడంతో.. తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు కాబోయే టీచ‌ర్లు. 

ప‌రీక్ష విధానం :

ఈసారి కూడా టెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకం కోసం పేపర్-1 నిర్వహిస్తారు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించేందుకు పేపర్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 1-8 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు, పేపర్-2 పరీక్షలో 6-10 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు ఉంటాయి.

టెట్ ప‌రీక్ష హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా..

☛ టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి.
☛ పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, డిసేబిలిటీ తదితర వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి.
☛ హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా లేకపోతే అభ్యర్థుల ఇటీవలి తాజా ఫొటోను అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించుకొని, ఆధార్‌ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో పర్మిషన్‌ అనంతరమే పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయం తీసుకుంటారు.
పరీక్షాకేంద్రం చిరునామాను ఒకరోజు ముందుగానే సంప్రదించడం ఉత్తమం.
☛ తొలి పేపర్ ఎగ్జామ్ కు సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు. సాయంత్రం పరీక్షకు సంబంధించి 5 తర్వాత మాత్రమే ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి అనుమతిస్తారు.
☛ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
☛ పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు సృష్టిస్తే అలాంటి అభ్యర్థులపై చర్యలు తీసుకుంటారు.

#Tags