Skip to main content

TET Exam: భువనగిరి జిల్లాలో టెట్‌ పరీక్షకు 2,385 మంది అభ్యర్థుల హాజరు

TET exam,Paper-1 Morning Session: 80.14% Attendance,Paper-2 Afternoon Session: 90.61% Attendance
TET exam

భువనగిరి : జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం జరిగిన పేపర్‌–1కు 2,976 మంది అభ్యర్థులకు గాను 2,385 మంది (80.14శాతం )హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌–2 పరీక్షకు 2,822కి 2,557 మంది (90.61) హాజరయ్యారు.

సమయానికి ముందే కేంద్రాల్లోకి అనుమతి

నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. కొన్ని చోట్ల ఉదయం 9 గంటలకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించగా మరికొన్ని సెంటర్లలో 9 గంటలకు ముందుగానే పంపించారు. భువనగిరిలోని జీనియస్‌ హైస్కూల్‌ వద్ద రెండు నిమిషాల ముందుగానే గేటు మూసివేయడంతో ఇదే సమయంలో వచ్చిన ఇద్దరు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. మొత్తం మీద ఆలస్యంగా వచ్చిన సుమారు 20 మంది అభ్యర్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి న్యూ డైమెన్షన్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు వసతులు కల్పించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పలువురు మహిళా అభ్యర్థులు చంటి పిల్లలతో పరీక్ష రాయడానికి వచ్చారు. తమ పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పగించి పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారు. వారు తిరిగివచ్చే వరకు చిన్నారుల ఆలనాపాలన వారి కుటుంబ సభ్యులే చూశారు.

Published date : 19 Sep 2023 10:30AM

Photo Stories