TS TET : టెట్‌ సిలబస్‌ ఇదే.. ఎవరు రాయొచ్చు అంటే..?

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదల చేసిన విషయం తెల్సిందే.
TS TET Eligibility

ఈ పరీక్షను జూన్‌ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష ఎవరు రాయొచ్చు.. సిలబస్‌ ఎలా ఉంటుంది అనే అంశంపై  సమగ్ర సమాచారం మీకోసం...

ఎవరు రాయొచ్చు? 
టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్‌ పండిట్, తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులను అర్హులుగా పేర్కొన్నారు. 
టెట్‌–పేపర్‌–1: టెట్‌ పేపర్‌–1 ను ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు అంటే ఎస్‌జీటీ పోస్ట్‌లకు ప్రామాణికంగా నిర్వహిస్తున్నారు.
పేపర్‌–1: ఇంటర్మీడియెట్‌/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
➤ 2015 డిసెంబర్‌ 23 తర్వాత ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకుని ఉంటే..ఆ పరీక్షలో 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు.
➤ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బీఈడీ లేదా బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
➤ ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం–బీఈడీ అభ్యర్థులను కూడా ఎస్‌జీటీ పోస్ట్‌లకు అర్హులుగా పేర్కొనడంతో వీరికి కూడా టెట్‌–పేపర్‌–1కు అర్హత లభించింది. వీరు టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో విజయం సాధించి, ఉద్యోగం సొంతం చేసుకుంటే.. ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ఆరు నెలల వ్యవధిలోని బ్రిడ్జ్‌ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

పేపర్‌–2 అర్హత : 
➤ ఆరు నుంచి పదో తరగతి వరకు ఆయా సబ్జెక్ట్‌లను బోధించేందుకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి ప్రామాణికంగా టెట్‌ పేపర్‌–2ను నిర్వహిస్తారు. 
➤ బీఏ/బీఎస్సీ/బీకాంలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్‌/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణత ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏబీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. (లేదా) బీఈ/బీటెక్‌లో 50 శాతంతో ఉత్తీర్ణత సాధించి బీఈడీ/బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా అర్హులు
➤ లాంగ్వేజ్‌ టీచర్‌ అభ్యర్థులు సంబంధిత లాంగ్వేజ్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా.. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీతోపాటు లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్‌తో బీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి. 
➤ ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్‌ పేపర్లకు హాజరు కావచ్చు. కానీ తదుపరి దశలో ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) నిర్వహించే నాటికి డీఈడీ లేదా బీఈడీలలో ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీకి అర్హత లభిస్తుంది.

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

టెట్ మోడ‌ల్‌పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

సిలబస్‌ ఇదే..
➤ టెట్‌ పరీక్ష రెండున్నర గంటల వ్యవధితో ఉంటుంది. మొత్తం 150 మార్కులుంటాయి. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. నెగెటివ్‌ మార్కులు ఉండవు.  
➤ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ మరియు బోధన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొదటి భాషకు సంబంధించి 30, రెండో భాష నుంచి 30, మ్యాథమెటిక్స్‌ 30, ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి 30 ప్రశ్నలుంటాయి.  
➤ చైల్డ్‌ డెవలప్‌మెంట్, విద్యాబోధనలో విద్యా మానసిక సంబంధ విషయాలకు ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థులు తెలుగు సహా మొత్తం 8 భాషలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రాంతీయ సిలబస్‌లోనే ప్రశ్నలుంటాయి.   
➤ సంబంధిత సబ్జెక్టుల్లో సబ్జెక్టు నుంచి 24 ప్రశ్నలు, విద్యా బోధనకు సంబంధించి 6 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ సైన్స్‌లో చరిత్ర, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ 48 మార్కులు, విద్యా బోధనకు 12 మార్కులు ఉంటాయి.  
➤ 150 మార్కుల టెట్‌కు జనరల్‌ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణిస్తారు. దివ్యాంగులు కనీసం 40 శాతం మార్కులు పొందితే అర్హులుగా పరిగణిస్తారు.

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags