Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా ఎస్‌ఐ తుది ఫలితాల్లో స‌త్తాచాటారు. టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ విడుదల చేసిన ఎస్‌ఐ తుది ఫలితాల్లో జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కానిస్టేబుల్స్‌ సత్తాచాటారు.
ts constable to si success stories

ఈ సందర్భంగా వీరిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్‌ఐలుగా ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ విధులు, కర్తవ్యాల్లో జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

☛ SI Inspirational Success Story : ఈ బల‌మైన సంక‌ల్పంతోనే.. ఎస్సై ఉద్యోగం కొట్టా.. ఎందుకంటే..?

అనంతరం ఎస్‌ఐలుగా ఎంపికై న కానిస్టేబుల్స్‌ ఉమాదేవి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి , శ్రీశైలం, శశిధర్‌, సుజిత్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, ఏఓ జ్యోతిర్మని, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ డీవీపీ రాజు, పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమీల, ఆర్‌ఐ సూర్య నాయుడు, జిల్లా పోలీస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..

☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..

#Tags