Inspirational Success Story : కడుపులో బిడ్డ ఉండగానే భర్త మరణం.. ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని నా బిడ్డ‌ను ఎస్సై చేశానిలా.. కానీ..

కన్నతల్లి రుణం ఎన్ని జన్మలైనా ఎత్తిన తీర్చుకోలేము.. అంటారు. ఎందుకుంటే.. క‌న్న‌త‌ల్లి త‌మ బిడ్ద‌ల మంచి భ‌విష్య‌త్ కోసం ఎటువంటి క‌ష్టంమైన ఎదుర్కొంటుంది.
ఎస్సై అయిన కొడుకుతో.. దొరగారి హనుమవ్వ

చివరి శ్వాస వరకు బిడ్డల కోస‌మే త‌పించేది ఒక క‌న్న‌త‌ల్లి మాత్ర‌మే. ఈ అమ్మ కూడా.. తన బిడ్డ భవిష్యత్తు కోసం ఎండనక.. వాననక.. కష్టపడి పంట సాగు చేస్తూ కొడుకును చదివించి ఎస్సైని చేసింది. 

☛ Babli Kumari Success Story : ఒకప్పుడు నేను సెల్యూట్ చేసే అధికారులకు నేడు నేనే బాస్‌.. ఈ క‌సితోనే..

కడుపులో ఏణ్నెళ్ల బిడ్డ ఉండగానే భర్త అకాల మరణం.. దిక్కుతోచని పరిస్థితిలో తనకున్న మూడెకరాల పొలాన్ని నమ్ముకుని సాగుబాట పట్టిందా తల్లి.. తన బిడ్డ భవిష్యత్తు కోసం ఎండనక.. వాననక.. కష్టపడి పంట సాగు చేస్తూ కొడుకును చదివించి ఎస్సైని చేసింది. ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామానికి చెందిన దొరగారి హనుమవ్వ విజయగాథ ఇది.

కడుపులో బిడ్డ ఉండగానే భర్త మ‌ర‌ణం..
కడుపులో బిడ్డ ఉండగానే భర్త చనిపోగా అత్తగారింటికి వచ్చి వ్యవసాయం మొదటు పెట్టింది హనుమవ్వ. మూడెకరాల్లో పంటలను సాగు చేస్తూ కొడుకును చదివించింది. మధ్యలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగా చివరికి ఎకరంన్నర భూమిని సైతం విక్రయించింది. అయినా దిగులు చెందక ఉన్న పొలంలోనే శ్రమించింది. సాగుచేసిన పంటలను అమ్మడానికి నిజామాబాద్‌ గంజ్‌కు వెళ్లేది.

☛ DSP Yegireddi Prasad Rao : ఆయ‌న కష్టాలను కళ్లారా చూశాడు..డీఎస్పీ అయ్యాడు..

కొడుకు ఎస్సై అయినా కూడా..
పొలం పనులను నేటికీ హనుమవ్వ ఒక్కతే చేసుకుంటుంది. తన కొడుకు ఎస్సై అయినా కూడా తనకు జీవితాన్ని చూపిన వ్యవసాయాన్ని మాత్రం మరవలేదు. తల్లి పడ్డ కష్టాన్ని వృథా చేయకుండా కొడుకు రాజారెడ్డి సైతం ఉన్నత చదువులు చదివి మొదట కానిస్టేబుల్‌గా ఎంపికై అనంతరం ఎస్సై పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం నవీపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.

☛ Success Story : సొంతూరికీ వెళ్ల‌కుండా చ‌దివా.. అనుకున్న ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

ఆడదానిగా నేను చాలా ఇబ్బందులను..
ఎడునెలల కొడుకు కడుపులో ఉన్నప్పుడే నా భర్త మరణించాడు. చాలా కఠినమైన పరిస్థితి ఉండేది. ఆడదానిగా నేను చాలా ఇబ్బందులు ఎదు ర్కొన్నాను. పొలం పనులు చేస్తూ కొడుకు ప్రయోజకుడిని చేయాలనే తపన మాత్రమే నాలో ఉండేది. వ్వవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. నేటికి కూడా వ్యవసాయం చేస్తున్నా. నా కొడుకు ఎస్సై కావడం ఎంతో సంతోషంగా ఉంది.

☛ Sheshadrini Reddy IPS Success Story : ఆన్‌లైన్‌లో స్ట‌డీమెటీరియల్‌ ఫాలో అవుతూ.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ

#Tags