Inter & 10th Class Model Papers: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.. మోడల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

కామారెడ్డి క్రైం : ఇంటర్‌, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

 ఆమె హైదరాబాద్‌ నుంచి మార్చి 1న‌ కలెక్టర్‌లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు కామారెడ్డికి విచ్చేసిన పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియాకు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఘన స్వాగతం పలికారు. ఆయన కూడా కామారెడ్డి నుంచి వీసీలో పాల్గొన్నారు. సీఎస్‌ మాట్లాడుతూ పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గృహజ్యోతి, రూ.500కే గ్యాస్‌సిలిండర్‌ పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. వీటి కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా పాలన సేవా కేంద్రాల కోసం అవసరమైన మేర డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్స్

అవసరమైన కంప్యూటర్‌లు, ప్రింటర్‌, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీసీలో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, తీసుకుంటున్న చర్యలను సీఎస్‌కు వివరించారు.

ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ సదాశివనగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మాల్‌ ప్రాక్టీస్‌కు ప్రయత్నం చేసిన ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీసీలో జెడ్పీ సీఈవో చందర్‌, డీఐఈవో షేక్‌ సలాం, డీఈవో రాజు, డీపీవో శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఈఈ రమేష్‌ బాబు పాల్గొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్

#Tags