Telangana 10th Results 2024 Release Date : 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ ఇదే..? అత్యంత వేగంగానే టెన్త్ పరీక్షల వాల్యూయేషన్..!
రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ ఏడాది జరగుతున్న 10వ తరగతి పరీక్షల కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసి.. పటిష్ట భద్రత మధ్య ఈ పరీక్షలను నిర్వహించారు.
కేవలం 9 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి..?
ఏప్రిల్ 3వ తేదీ నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొత్తం తొమ్మిది రోజుల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా పరీక్షాల విభాగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ లెక్క ప్రకారం.. ఏప్రిల్ 11వ తేదీ నాటికి పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తి కానుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే.. గతేడాదితో పోలిస్టే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే.. ఫలితాలు కూడా కొంత ముందుగానే వెలువడనున్నాయి.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఎప్పడంటే..?
గతేడాది తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగాయి. ఫలితాలను మే 10వ తేదీన విడుదల చేశారు. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18వ తేదీనే మొదలయ్యాయి. అలాగే ఏప్రిల్ 2వ తేదీతో అన్ని ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 33 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది.
How to Check TS SSC Results 2024.. ?
☛ టెన్త్ పబ్లిక్ పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్ సైట్ www.sakshieducation.com లోకి వెళ్లాలి.
☛ హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
☛ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీను నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
☛ అప్పుడు మీ టెన్త్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!