National Education Policy: విద్యార్థులకు వృత్తివిద్య నైపుణ్యం

నిర్మల్‌ఖిల్లా/మంచిర్యాలఅర్బన్‌: జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లో నూతన హంగులు సమకూర్చాలనే లక్ష్యంతో పీఎంశ్రీ అమల్లోకి తెచ్చింది.

ఉపాధి చదువు(వృత్తి విద్య) అందించాలని నిర్ణయించింది. దశలవారీగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి కల్పించేందుకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వృత్తివిద్య కోర్సుల అమలుకు చర్యలు చేపట్టింది. 2023–24 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 80 పాఠశాలల్లో విద్యార్థులకు ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కోర్సులు అందించేందుకు శ్రీకారం చుట్టింది.

చదవండి: AP SI Job: ప్ర‌స్తుతం ఖాకీ చొక్కా వేసుకుంటోంది.. తొంద‌ర‌లో దానికి స్టార్స్ బిగించ‌నుంది.. కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా సుమతి..!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 17విద్యాసంస్థలను ఎంపిక చేసింది. వీటిలో 16కేజీబీవీలు, ఒకటి తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల ఉన్నాయి.

ఎంపిక చేసిన పాఠశాలల్లో కోర్సులు నిర్వహించే ఏజెన్సీలు గుర్తించి కోర్సుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నారు. ఉన్నత చదువులకు వెళ్లలేని వారికి ఈ వృత్తి విద్య కోర్సులు ఉపాధిపై భరోసానిచ్చే విధంగా సర్కారు నిర్ణయం తీసుకుంది.

శిక్షణ తరగతులు ఇలా..

ఎంపిక చేసిన పాఠశాల, కళాశాలల్లో 9, 11వ తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత 10, 12వ తరగతుల్లో విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్స్‌ నిర్వహించి ఎంపిక చేసిన వృత్తివిద్య కోర్సుల్లో నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకోనున్నారు.

పాఠశాల విద్య పరీక్ష విభాగం బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఆధ్వర్యంలో వృత్తివిద్య కోర్సుల థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలను సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌(ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించి ప్రతిభను చాటిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.

భాగస్వామ సంస్థలు ఇవే..

రాష్ట్ర సమగ్ర శిక్షతోపాటు దేశంలోని ప్రముఖ వృత్తి శిక్షణ సంస్థలు, ఈ–ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి.

వృత్తివిద్య శిక్షణలో భాగస్వాములుగా బెంగళూరుకు చెందిన ఇండస్‌ ఎడ్యుట్రెయిన్‌, లక్ష్య జాబ్‌ స్కిల్స్‌ అకాడమీ, న్యూఢిల్లీకి చెందిన మైండ్‌ లీడర్స్‌ లర్నింగ్‌ ఇండియా, మధ్యప్రదేశ్‌కు చెందిన యంగ్‌ శక్తి శిక్షణ సామాజిక వికాస్‌ సంస్థలు న్నాయి. వీటితోపాటు నేషల్‌ స్కిల్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ) కూడా సమన్వయంతో పని చేయనుంది.

ఆయా జిల్లాల్లో అమలు చేయనున్న వృత్తివిద్య కోర్సుల నిర్వహణను ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పార్టనర్స్‌(వీటీపీ)కు అప్పగించారు. ఆయా సంస్థల నిపుణులైన శిక్షకులను నియమించి త్వరలోనే తరగతులు ప్రారంభిస్తారు.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు పాఠశాలలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌ అర్బన్‌ మండలం కేజీబీవీ, ఇంద్రవెల్లి మండలంలోని కేజీబీవీ, కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి, బెజ్జూరు, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, జైనూరు మండలాల్లో కేజీబీవీలు, మంచిర్యాల జిల్లాలోని తాండూరు, బెల్లంపల్లి, జన్నారం, చెన్నూరు, జైపూర్‌, నెన్నెల మండల కేంద్రాల్లోని కేజీబీవీలు, నిర్మల్‌ జిల్లా భైంసా, నిర్మల్‌ మండలాల్లోని కేజీబీవీలు, నిర్మల్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల విద్యాలయం ఎంపికయ్యాయి.

నైపుణ్యాలు పెంపొందించేందుకే..

వృత్తివిద్య శిక్షణ ద్వా రా ఉపాధి నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించేందుకు ఈ కార్యక్రమం స మగ్ర శిక్ష ద్వారా రూ పొందించింది. ఇప్పటికే జిల్లా నుంచి మా పాఠశాల ఎంపికై నట్లు ఉత్తర్వులుందాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చు.
– నీరడి గంగాశంకర్‌, ప్రిన్సిపల్‌, తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, సోఫీనగర్‌, నిర్మల్‌

#Tags