Physical Science Teachers Forum: ఫిజిక్స్‌ టీచర్లను గణితం బోధించమనడం అన్యాయం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్లను ఆరు, ఏడు తరగతులకు గణితం బోధించమంటూ విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలు సహేతుకంగా లేవని ఫోరం ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్స్, తెలంగాణ స్టేట్‌ ప్రతినిధులు తెలిపారు.

దీన్ని వ్యతిరేకిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌సింగ్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ నేతృత్వంలోని బృందం విద్యాశాఖ ము ఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి వినతిప త్రం ఇచ్చారు. రాష్ట్రంలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కన్నా, గణితం చెప్పే టీచర్లు 20 శాతం ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

చదవండి: Online Evaluation Process: అధ్యాప‌కులు చేసే ఆన్‌లైన్ మూల్యాంక‌నం విధానం ఇలా..!

కొత్త నిబంధ న వల్ల ఒక్కో టీచర్‌ వారానికి 30 పీరియడ్లు చె ప్పాల్సి వస్తుందని, దీనివల్ల ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని వివరించారు. ఈ కారణంగా ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుకు కూడా న్యాయం చేసే అవకాశం ఉండదన్నారు. వెంటనే ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని కోరారు.    

#Tags