Online Evaluation Process: అధ్యాపకులు చేసే ఆన్‌లైన్ మూల్యాంకనం విధానం ఇలా..!
నంద్యాల:
అధ్యాపకులకు అవగాహన సదస్సు
సప్లిమెంటరీ జవాబుపత్రాలను ఆన్‌లైన్ ద్వారానే మూల్యాంకనం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు అందాయి. ఈ ఆన్‌లైన్ విధానంపై అవవగాహన కల్పించేందుకు నంద్యాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అన్ని యాజమాన్యాల కళాశాలల నుంచి ఒక్కో అధ్యాపకుడు కచ్చితంగా హాజరయ్యారు. వర్చువల్ విధానంలో బోర్డు అధికారులు అవగాహన కల్పించారు.
–సునీత, డీవీఈఓ, నంద్యాల
ఇంటర్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధికారులు నాంది పలికారు. ఇక నుంచి ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్ విధానంలో చేపట్టడానికి సర్వం సిద్ధం చేశారు. ఈనెల 24 నుంచి జరుగుతున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే దిద్దేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ప్రతి జిల్లాలోనూ మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేసేవారు. వార్షిక పరీక్షలకు 20 రోజులు, సప్లిమెంటరీ పరీక్షలకు 12 రోజుల పాటు మూల్యాంకనం జరిగేది. సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయిన తర్వాత చేపట్టే మూల్యాంకనం సరిగ్గా జూన్ 1 నుంచి మొదలవుతుంది. అప్పడప్పుడే జూనియర్ కళాశాలలు పునః ప్రారంభమవుతుండటంతో ఆ సమయంలో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతుంటాయి.
Job Opportunities : కెమికల్ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు..
అయితే, అధ్యాపకులందరూ స్పాట్ కేంద్రంలో ఉండాల్సి రావడంతో ఓ వైపు తరగతుల నిర్వహణకు ఆటంకంతో పాటు మరోవైపు అడ్మిషన్లకు ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో ఈ సమస్యను అధిగమించి అధ్యాపకులందరూ కళాశాలల్లో అందుబాటులో ఉండేందుకే ఆన్‌లైన్ మూల్యాంకనం విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదు. మ్యానువల్‌గా మూల్యాంకనం చేసే సమయంలో మార్కుల కూడికలో పొరపాట్లు, కొన్ని ప్రశ్నలకు మార్కులు మరిచి పోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఒక విద్యార్థికి 70 మార్కులు వస్తే మొత్తం మార్కులు వేసే సమయంలో పొరపాటున సున్నా ఎగిరిపోయి 7 మార్కులు మాత్రమే వేశారు. తర్వాత రీ వెరిఫికేషన్‌లో అసలు విషయం బయట పడింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.
Asian Championship: తొలి భారత జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్
ప్రశ్నలు డిస్‌ప్లే ఇలా..
ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేటప్పుడు మొదటి ప్రశ్న డిస్‌ప్లే వచ్చిన తర్వాత ఎగ్జామినర్ పరిశీలించిన తర్వాతనే రెండో ప్రశ్న వస్తుంది. ఇలా ప్రతి ప్రశ్న తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చూపిస్తుంది. విద్యార్థి జవాబు రాసినా, రాయకపోయినా అన్ని ప్రశ్నలూ పరిశీలించాల్సి ఉంటుంది. దీనిద్వారా ఏ ఒక్క ప్రశ్న మరిచిపోయే అవకాశం ఉండదు. మార్కుల విషయంలో ఒక ప్రశ్నకు మ్యాగ్జిమం వేయాల్సిన మార్కులంటే ఎక్కువ వేసినా తీసుకోదు.
తరగతుల నిర్వహణకు ఆటంకం లేకుండా..
ఆన్‌లైన్‌లో పేపర్లు దిద్దే ఎగ్జామినర్లు ఎట్టి పరిస్థితుల్లో కళాశాలల్లో విద్యార్థుల తరగతలకు ఆటంకం కలిగించకూడదు. ఉదయం 8 గంటలలోపు, తర్వాత కళాశాల నుంచి వచ్చిన తర్వాత మూల్యాంకనం చేసుకోవచ్చు. కళాశాలలో తరగతులు లేని సమయంలోనూ చేసుకోవచ్చు. ప్రతి ఎగ్జామినర్ టీక్యూఐడీ ద్వారా లాగిన్ అయిన వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోవాలి. తర్వాత వెబ్ కెమెరా ముందు తన ఫొటో క్యాప్చర్ చేసి లాగిన్ అవుతారు. ముందుగా ఐదు ప్రాక్టీస్ పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత రెగ్యులర్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో ఎగ్జామినగర్‌కు రోజుకు గరిష్టంగా 50 జవాబు పత్రాలుఅందుబాటులో ఉంటాయి.
Awareness Program: ఆన్‌లైన్ విధానంపై బోర్డు సూచనలు..
డీఆర్‌డీసీ స్థానాల్లో ఆర్‌ఆర్‌ఎస్‌సీలు..
మ్యానువల్ మూల్యాంకనం సమయంలో ప్రతి జిల్లాలోనూ డీఆర్డీసీ జిల్లా రీకలెక్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండేది. దీని ద్వారా జిల్లాలోని అన్ని జవాబు పత్రాలను కలెక్షన్ చేసి ఎంపిక చేసిన జిల్లాలకు పంపేవారు. ఇప్పుడు రీజనల్ రెసిప్షన్ స్కానింగ్ సెంటర్ (ఆర్‌ఆర్‌ఎస్సీ)లు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా ఎంపిక చేసిన ఆర్‌ఆర్‌ఎస్‌సీలకు జవాబు పత్రాలు పోతాయి. అక్కడ ఆన్‌లైన్‌లో నమోదు చేసి మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు.