Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్, హైదరాబాద్‌: ఎండాకాలం వచ్చిందంటే ప్రతి విద్యార్థి దృష్టి సెలవులపైనే పడుతుంది.

ఇన్ని రోజులు బడులకెళ్లి విద్యాబ్యాసం చేసిన స్టూడెంట్స్ అంతా కూడా వేసవిలో ఇంటి వద్ద ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎండాకాలం సెలవులకు ముందు కొన్ని రోజుల పాటు ఒక్క పూట బడులు నిర్వహిస్తుంటారు. తాజాగా మార్చి 7న‌ ఒక్క పూట బడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చదవండి: School Holidays: మార్చి 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు.. కార‌ణం ఇదే..

క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఒక్కపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లు ఒక్కపూట బడులు నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు. వీరికి తొలుత మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు కొనసాగిస్తారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.

#Tags