ఈ స్పెషల్‌ ఆఫీసర్లకు మోడల్‌ స్కూల్‌ హాస్టళ్ల బాధ్యతలు

రాష్ట్రంలో మోడల్‌ స్కూళ్లకు సంబంధించిన బాలికల హాస్టళ్ల నిర్వహణ బాధ్యతను కస్తూర్బా బాలికా విద్యాలయ ప్రత్యేక అధికారులకు అప్ప గించారు.
కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లకు మోడల్‌ స్కూల్‌ హాస్టళ్ల బాధ్యతలు

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమీపంలోని కేజీబీవీల అధికారులే తాత్కాలికంగా మోడల్‌ స్కూల్స్‌ బాలికల హాస్టళ్ల బాధ్యతలను చూడాలని పేర్కొంది. ఇప్పటి వరకూ వీటి నిర్వహణను మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాళ్లు చూసేవారు. అయితే, తమ జాబ్‌చార్ట్‌లో ఈ విధుల్లేవని, అయినా తమకు అప్పగించడం సరికాదని ప్రిన్సిపాళ్లు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు చెప్పటంతో విద్యా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేజీబీవీల్లో ఉన్నవారంతా తా త్కాలిక ఉద్యోగులేనని, ఏ చిన్న తప్పు జరిగినా వారిని ఉద్యోగాల నుంచి తొలగించే పరిస్థితి ఎదురవుతుందని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి జూలై 27న ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. 

చదవండి: అనాధ, నిరుపేద ఆడపిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ఇది తాత్కాలిక ఏర్పాటే: విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ 

కోర్టు తీర్పు నేపథ్యంలో తాత్కాలికంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ రమేశ్‌ తెలిపారు. బాధ్యతలు పెంచడం వల్ల కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్‌ వేతనాలు నెలకు రూ. 2,500 పెంచినట్టు పేర్కొన్నారు. ప్రతి హాస్టల్‌లో కేర్‌టేకర్‌ కూడా ఉంటారని, ఈ నేపథ్యంలో ఇది పెద్ద భారం కాదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 

చదవండి: పదవీవిరమణ వయసు పెంపు

#Tags