Skip to main content

కేజీబీవీల్లో అనాధ, నిరుపేద ఆడపిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

సాక్షి, అమరావతి: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లోని నిరుపేద, అనాథ బాలికల చదువులు ఆరోగ్యంతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
విద్యార్థినులకు రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఇటీవలే వారి డైట్‌ చార్జీలను ప్రభుత్వం పెంచింది. చదువుల ఒత్తిడి లేకుండా ఉండేందుకు విద్యార్థినులు యోగాతో పాటు ఆటపాటలతో అభ్యసనం సాగించేలా చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. టెన్త్, ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతోంది. వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం వారికి అర్హులైన బోధనా సిబ్బందిని నియమించి ఆయా సబ్జెక్టుల బోధన చేయిస్తోంది. ఒకప్పుడు 88 శాతం మేర ఉన్న ఉత్తీర్ణత శాతం ఇప్పుడు వంద శాతానికి చేరుకుంది. పిల్లలకు యోగాతోపాటు వారికి ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. టెన్త్ వరకే తరగతులు ఉన్నప్పుడు విద్యార్థినులు ఆపై చదువులకు వెళ్లే ఆస్కారం లేక అంతటితో చదువులు ముగించేవారు. ఇప్పుడు ఈ కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.

352 కేజీబీవీల్లో 82,188 మంది విద్యార్థినులు
రాష్ట్రంలో 352 కస్తూరిబా బాలికా విద్యాలయాలున్నాయి. వీటిలో 221 కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులను ప్రారంభించారు. 131 కేజీబీవీల్లో 6–10 వరకు తరగతులు నిర్వహిస్తుండగా మిగిలిన వాటిలో 6–12వ తరగతి వరకు తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌ తరగతుల నేపథ్యంలో అదనపు భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టించింది. ఇదే కాకుండా కొన్ని మోడల్‌ స్కూళ్లలో హాస్టళ్లు లేకపోవడంతో అక్కడి బాలికల కోసం కేజీబీవీల్లో వసతి గృహాలను ప్రారంభించారు. మోడల్‌ స్కూళ్లు, ఇతర స్కూళ్లలో చదివే విద్యార్థినులకు అక్కడ ఆవాసం కల్పిస్తున్నారు.

గత నాలుగేళ్లలో 352 కేజీబీవీల్లో టెన్త్ లో విద్యార్థినుల ఉత్తీర్ణత ఇలా..

సంవత్సరం

హాజరు

ఉత్తీర్ణత

శాతం

2016–17

12,337

10,965

88.88

2017–18

11,664

11,056

94.79

2018–19

12,828

12,731

99.24

2019–20

13,841

13,841

100

ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత.. (31 కేజీబీవీల్లో)

2019–20

1,621

1,621

100



నాణ్యమైన పదార్థాలతో రోజుకో మెనూ
ఇక ప్రతిరోజూ కేజీబీవీ విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించే డైట్‌ చార్జీలను రూ.1,400కు పెంచింది. మెనూలో కూడా పలు మార్పులు చేసింది. ఫలితంగా.. గతంలో నాసిరకం ఆహార పదార్థాలు వండి వడ్డించగా ఇప్పుడు రోజుకోరకమైన పదార్థాలతో సరికొత్త మెనూను రూపొందించి ఆ మేరకు అన్ని కేజీబీవీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం లేచాక ప్రీ బ్రేక్‌ఫాస్ట్, బ్రేక్‌ఫాస్ట్, బ్రంచ్, లంచ్, ఈవెనింగ్‌ స్నాక్స్, డిన్నర్, భోజనం తరువాత పండ్లు అందిస్తున్నారు. మాంసాహారులకు చికెన్, బగారా రైస్, శాఖాహారులకు బగారా రైస్, శాఖాహార కర్రీ అందిస్తున్నారు. పాలు, రాగిజావ, రాగి సంగటి, బూస్ట్, చిక్కీలు, ఊతప్పం, ఇడ్లీలు, పూరీలు, ఆలూ బఠానీ కుర్మా, చపాతీ, కోడిగుడ్లు, అన్నం, రోజుకోరకమైన కూరలు ఇలా వివిధ రకాల వంటకాలతో విద్యార్థినులకు పుష్టికరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.

కేజీబీవీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర విద్యార్థినుల సంఖ్య ఇలా..

జిల్లా

ఎస్సీ

ఎస్టీ

బీసీ

బీపీఎల్‌

ముస్లిం

మొత్తం

శ్రీకాకుళం

890

503

5,536

686

6

7,621

విజయనగరం

999

1,642

5,337

207

21

8,206

విశాఖపట్నం

378

2,938

4,668

574

33

8,591

తూ. గోదావరి

592

1,389

771

65

7

2,824

ప. గోదావరి

197

232

222

0

0

651

కృష్ణ

449

132

166

5

6

758

గుంటూరు

2,326

1,200

1,358

300

202

5,386

ప్రకాశం

4,093

429

2,591

1,104

94

8,311

నెల్లూరు

1,262

165

745

175

16

2,363

చిత్తూరు

1,265

371

2,463

481

170

4,750

వైఎస్సార్‌ కడప

2,295

303

2,798

1,333

75

6,804

అనంతపురం

3,499

1,138

7,237

1,429

599

13,902

కర్నూలు

3,950

551

5,815

788

884

11,988

మొత్తం

22,195

10,993

39,707

7,147

2,113

82,155

Published date : 27 Mar 2021 03:04PM

Photo Stories