Collector Sikta Patnaik: బడి అంటే కుటుంబం: కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, IAS

నారాయణపేట: విలువలతో కూడిన బోధన జరగాలని... బడి అంటే బాధ్యత కాదని కుటుంబంగా భావించి నిబద్ధతతో పనిచేస్తారనే స్థానిక అభ్యర్థులను ఎంపిక చేశామని.. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేలా బోధించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు.

ఆగ‌స్టు 22న‌ జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు మెరిట్‌ ఆధారంగా ఎంపికై న అకాడమిక్‌ ఇన్‌స్టక్టర్స్‌ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు.

ఎక్కడా లేనివిధంగా జిల్లాకే ప్రత్యేకంగా నియమించిన అకాడమిక్‌ ఇన్‌స్టక్టర్స్‌ విద్యాశాఖలో గతేడాది సాధించిన ప్రగతి మరింత మెరుగ్గా నిర్వహించి, జిల్లాని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫోనిక్స్‌ కార్యక్రమం, ఎఫ్‌ఎల్‌ఎన్‌, న్యాస్‌ సంసిద్ధత, క్లాస్‌ రూమ్‌ మేనేజ్‌మెంట్‌, చైల్డ్‌ సెంట్రిక్‌ టీచింగ్‌ టూల్స్‌పై విద్యాశాఖ వారి రిసోర్సు పర్సన్‌ శిక్షణ ఇచ్చారు.

చదవండి: Mega Job Mela: 25న మెగా జాబ్‌మేళా

మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యా లను తప్పనిసరిగా మెరుగుదల చేస్తామని శిక్షణ పాల్గొన్నవారు పేర్కొన్నారు. శిక్షణ తరగతి గదుల్లో మెరుగైన ప్రమాణాల సాధనకు చక్కని సోపానం కావాలని, వీరికి కావాల్సిన పూర్తి అకాడమిక్‌ సపోర్ట్‌ ఇవ్వాలని ఏఎంఓకు కలెక్టర్‌ సూచించారు.

జిల్లాలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. శిక్షణలో డీఈఓ అబ్దుల్‌ ఘని, ఏఎంఓ విద్యాసాగర్‌ రిసోర్సు శిక్షకులు పాల్గొన్నారు.

#Tags