Mega Job Mela: 25న మెగా జాబ్‌మేళా
ఈమేరకు ఆగస్టు 22న జిల్లా ఉపాధిశాఖ అధికారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. అర్హత, ఆసక్తి గల యువతీ, యువకులు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జామ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99633 57250, 98853 46768లలో సంప్రదించాలని కోరారు.
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
సిరిసిల్ల టౌన్: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి కోరారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతిని ఆగస్టు 22న సిరిసిల్లలోని ఓ ఫంక్ష న్‌హాలులో నిర్వహించారు.
అంజిరెడ్డి మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి విద్యాసంస్థలు, వసతిగృహాల ఏర్పాటుకు తన ఆస్తులను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు మద్దూరు రాంరెడ్డి, పూర్మాణి రాంలింగారెడ్డి, పాతూరి మహేందర్‌రెడ్డి, బాణాపురం గంగారెడ్డి, పొన్నాల బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే పరీక్షల్లో విజయం సాధిస్తారని సైకియాట్రిస్టు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నా రు.
ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలే జీలో కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 22న విద్యార్థులకు మానసిక ఒత్తిడిని ఎలా జయించాలో అవగాహన కల్పించారు. సైకియాట్రిస్టు ప్రవీ ణ్‌కుమార్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు యోగా, వ్యాయామం చేయాలన్నారు. వైద్యాధికారి గీతాంజలి, ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు.