Gurukul Admissions: ‘గురుకుల’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

డిచ్‌పల్లి(నిజామాబాద్‌ రూరల్‌): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (టీఎస్‌డబ్ల్యూఆర్‌) విద్యాలయాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (టీటీడబ్ల్యూఆర్‌ఈఐ) విద్యాలయాల్లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్ధ నిజామాబాద్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (ఆర్‌సీవో) కే.అలివేలు తెలిపారు.

ప్రవేశాలకు సంబంధించిన వివరాలను మార్చి 19న‌ ఆమె వెల్లడించారు. 2024–25 సంవత్సరానికి 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్న నేపథ్యంలో, ప్రవేశ పరీక్ష బీఎల్‌వీసెట్‌– 2024 అభ్యర్థులు www.tswreis.ac.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

చదవండి: KGBV Admissions 2024: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పాఠశాలల వారీగా, తరగతులు, కులాల వారీగా ఖాళీలను సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఆయా జిల్లాల్లోని సమీప సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో సంప్రదించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 21 న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపిక చేసిన పరీక్షాకేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఆర్‌సీవో తెలిపారు.
చదవండి: Gurukul Schools: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..

#Tags