TS Tenth Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాల తనిఖీ..
విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఉపాధ్యాయులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు డీఈఓ..
నార్నూర్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని డీఈవో ప్రణీత అన్నారు. మండలంలోని తాడిహత్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎస్‌ను ఆదేశించారు.
National Level Wrestling: జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఈ విద్యార్థిని ఎంపిక..
అనంతరం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సమయపాలన పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట ఎంఈవో ఆశన్న, సీఎస్ పవార్ అనిత, ఉపాధ్యాయులు తదితరులున్నారు.
AP POLYCET 2024: పాలిసెట్-2024 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?
#Tags