National Level Wrestling: జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఈ విద్యార్థిని ఎంపిక..
Sakshi Education
ఈనెల నిర్వహించిన రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్న అనేక అభ్యర్థుల్లో ఈ విద్యార్థిని తన ప్రతిభను కనబరచింది. ఈ నేపథ్యంలో తను తన కళాశాల సిబ్బందులనుంచి అభినందనలను అందుకుంది..
అరకులోయ రూరల్: చిత్తూరు డీఎస్‌ఏ స్టేడియంలో ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించిన రెజ్లింగ్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని నిర్మల ప్రతిభ కనబరచింది. బంగారు పతకం సాధించిన ఈమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చలపతి తెలిపారు.
AP POLYCET 2024: పాలిసెట్-2024 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?
ఈ సందర్భంగా ఆమెను ఆయనతోపాటు కళాశాల సిబ్బందులు అభినందించారు. ఉత్తరప్రదేశ్ నోయిడలో ఈనెల 28న జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో నిర్మల పాల్గొంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కళాశాల సిబ్బంది రోజారాణి, కుమారి, ప్రణీత, ధర్మారావు, మౌనిక పాల్గొన్నారు.
Medical College: త్వరలో పూర్తి కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం..
Published date : 24 Mar 2024 09:30AM