Tenth Class: ఇలా సాధన చేస్తే మంచి మార్కులు సాధించే వీలుంది

టెన్త్‌లో మంచి మార్కులు సాధించాలని ప్రతి విద్యార్థీ ఆరాట పడతారు.
ఇలా సాధన చేస్తే మంచి మార్కులు సాధించే వీలుంది

మరికొద్ది గంటల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు ఆఖరి నిమిషంలో సాధనా కీలకమేనని గత అనుభవాలు చెబుతున్నాయి. పరీక్ష రాసే సబ్జెక్టును ఏ విధంగా చదువుకుంటే మంచి మార్కులొస్తాయి? అనే విషయాన్ని ‘సాక్షి’అనేక మంది నిపుణుల ద్వారా సేకరించిన సూచనలను క్రోడీకరించి అందిస్తోంది. టెన్త్‌ పరీక్షలు ఈసారి గతంకన్నా భిన్నమైనవని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లే ఇస్తున్నారు. సైన్స్‌ రెండు పేపర్లనూ వెంటవెంటనే రాయాల్సి ఉంటుంది. ఏదేమైనా టెన్షన్‌ విడిచి పెట్టి, పరీక్షకు వెళ్ళే ముందు ఒక్కసారి తేలికైన పద్ధతిలో, అంశాల వారీగా పునశ్చరణ చేసుకుంటే టెన్త్‌ పరీక్షల్లో మార్కులపై నూటికి నూరు శాతం పట్టు సాధించడం ఖాయమనే చెప్పాలి. 

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్  బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

తెలుగులో అక్షర దోషం రానివ్వొద్దు... 

తెలుగులో పద్య, గద్య భాగాలు ముఖ్యమైనవి. ఇంతకాలం సాధన చేసిన వాటినే పునశ్చరణ చేస్తే మేలు. రామాయణ పాఠంపై పట్టు ఉంటే 12 మార్కులు వచ్చే వీలుంది. బట్టీ విధానం కాకుండా రామాయణ ఉద్దేశ్యాన్ని, సారాంశాన్ని అర్థం చేసుకుంటే సమాధానాలు తేలికగా రాయొచ్చు, ఉపవాచకంలోనూ పాత్రల స్వభావాన్నే తెలుసుకుంటే మంచిది. వ్యాకరణంలో సంధులు, సమాసాలు, చందస్సు, అర్థాలు, సొంత వ్యాక్యాలు, ప్రకృతి, వికృతులు, ఉత్పత్త్యార్థాలపై దృష్టి పెట్టాలి. అక్షర దోషాలను రానివ్వకుండా ఉంటే మంచి మార్కులొచ్చే వీలుంది. 

పాత ప్రశ్నపత్రాల సాధనతో హిందీలో మెరుగైన మార్కులు.. 

భాషాదోషాలు లేకుండా రాస్తే హిందీలో ఎక్కువ మార్కులు సాధించే వీలుంది. హిందీ ‘పార్ట్‌–ఏ’లో 60 మార్కులుంటాయి. పేరాగ్రాఫ్‌కు 20 మార్కులిస్తారు. వాటిని చదవి అర్థం చేసుకుంటే సమాధానాలు తేలికగా రాయొచ్చు. వ్యాసాలు, లేఖారచన ద్వారా సృజనాత్మకతను పరిశీలిస్తారు. ప్రశ్నలన్నీ బహుళ ఐచి్చక రూపంలో ఉంటాయి. పాఠ్యపుస్తకంలోని భాషా కీ బాత్‌ ఆధారంగా అభ్యసిస్తే మేలు జరుగుతుంది. ఒక్కసారి పాత ప్రశ్నపత్రాలు సాధన చేసే మంచి మార్కులు సాధించే వీలుంది. 

తులనాత్మకతతోనే జీవశాస్త్రం.. 

గతానికి భిన్నంగా భౌతిక, జీవశాస్త్రాల పరీక్షలు ఒకేరోజు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షకు గంటర్నర సమయం ఉంటుంది. కాబట్టి జీవ శాస్త్రంలో విషయంపై పట్టుకోసం రివిజన్‌ చేసుకోవాలి. ఇది కూడా స్వీయ విశ్లేషణతో ముందుకెళ్లాలి. చాలామందిలో రెండు పరీక్షలున్నాయనే భయం, ఒత్తిడి కనిపిస్తున్నాయి. దీన్ని దూరం చేసుకోవాలి. అంశాలవారీగా చార్టులు, బ్లాక్‌ డయాగ్రమ్స్‌ను సొంతంగా తయారు చేసుకొని చదివితే పరీక్ష రాయడం తేలిక. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనం చేస్తే మంచి ఫలితాలొస్తాయి. అన్వయం చేసేటప్పుడు వాస్తవ పరిస్థితులను గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై ఎక్కువ అగాహన ఉంటే పూర్తి మార్కులు రాబట్టడం కష్టమేమీ కాదు. పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ సమన్వయ వ్యవస్థలు, ప్రత్యుత్పత్తి వంటి వాటిపై లోతుగా రివిజన్‌ చేసుకుంటే మంచిది. 

భయం వదిలేస్తే గణితంలో వందశాతం 

గణితంలో మంచి మార్కులు రావాలంటే ముందు భయాన్ని పోగొట్టుకోవాలి. సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రం అధ్యాయాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. పాఠ్యాంశాల చివరలో ఉండే సమస్యలన్నీ మరోసారి రివిజన్‌ చేస్తే మంచి మార్కులొస్తాయి. గ్రాఫ్‌లు, నిర్మాణాల సమస్యలకు సమాధానాలు కనుగొనడంపై దృష్టి పెడితే నూటికి నూరు మార్కులు సాధించే వీలుంది. 

మార్కుల తంత్రం ఆంగ్లం.. 

పార్ట్‌–ఏలో బీ, సీ సెక్షన్లపై దృష్టి పెట్టాలి. అక్షర దోషాలు లేకుండా రాసేందుకు ప్రయతి్నంచాలి. లేబుల్స్, పై డయా గ్రమ్స్, బార్‌ డయాగ్రమ్స్, చార్ట్స్‌ వంటి వాటిపై ఎక్కువ శ్రద్ధతో రివిజన్‌ చేయాలి. పాఠ్యాంశాలను సొంతంగానే విశ్లేషించే సామర్థ్యం ఉందనే భావనతో ఉండాలి. ముఖ్యమైన పద్యాలు, యాంటినిమ్స్, సినానిమ్స్, ప్యాసివ్‌ వాయిస్‌ను ఒక్కసారి సాధన చేస్తే పరీక్ష తేలికవుతుంది. ఆంగ్లంలో విద్యార్థుల విశ్లేషణ నైపుణ్యాన్ని పెంచుకుంటే పరీక్షల్లో ప్రతిభను చాటే అవకాశంగానే భావించాలి. వ్యాసాలు చదువుతూ సాధన చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. 

సాంఘికం పద్ధతి ఇలా... 

సాంఘిక శాస్త్రాన్ని రివిజన్‌ చేసేప్పుడు కచ్చితంగా తేలికైన వాటిని ముందుగా చదవాలి. ఆ తర్వాత కఠిన అంశాలు ఒకటికి రెండుసార్లు చదవాలి. పార్ట్‌–ఏలో 60 మార్కులు, పార్ట్‌–బీలో 20 మార్కులుంటాయి. భేదాలు, పోలికలు, ఉదాహరణలతో సమాధానాలివ్వడం ముఖ్యం. హిమాలయాల ప్రాధాన్యత, పశి్చమ కనుమల మధ్య భేదాలు, వాతావరణంలో వచ్చే మార్పులు, జనాభా పెరుగుదలకు కారణాలు, వలసల వర్గీకరణ, ఉత్పత్తి కారకాలు, ప్రపంచీకరణ ప్రభా­వం, ఆహార భద్రత ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ యుద్ధాలకు కారణాలు, ఆర్థిక మాంద్యం ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. సమాచార, పట నైపుణ్యం, ఇచి్చన అంశాన్ని చదివి వ్యాఖ్యలు రాయడంపై చివరి వరకూ సాధన చేయాలి. పటాలు, పట్టికలు, గ్రాఫ్‌లపై రివిజన్‌ చేసుకుంటే మంచిది. 

ప్రధాన హెడ్డింగుల్లో ‘భౌతిక’ రహస్యం 

భౌతిక శాస్త్రంలో ప్రయోగాలపై పట్టు సాధిస్తే పరీక్షల్లో పూర్తి మార్కులొస్తాయి. ప్రయోగ నమాచార సేకరణలో నైపుణ్యా­లు, బొమ్మలు, నిత్య జీవితంలో వాటి వినియోగం అంశాలపై దృష్టి పెట్టాలి. పార్ట్‌–ఏ అంశాలను అప్లికేషన్‌ అప్రోచ్‌తో చదవాలి. నిజజీవిత ఘటనలతో పాఠ్యాంశాలను అన్వయించుకోవాలి. విషయ అవగాహనతోపాటు ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు పట్టాలు తదిత అంశాలపై అధ్యయనం చేయాలి. ప్రధాన హెడ్డింగులు గుర్తుంచుకుంటే సమాధానాలు బాగా రాసే వీలుంది. కాంతి పరివర్తనం, వక్రీభవనం, విద్యుత్‌ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కర్బన సమ్మేళనాలపై దృష్టి పెట్టాలి. వర్గీకరణ, రసాయన సమీకరణలు వస్తాయి. లఘు, అతిలఘు బహుళైచ్చిక ప్రశ్నలు సులభంగా రాసి ఎక్కువ మార్కులు పొందొచ్చు. 

#Tags