SFI: ఫీజు నియంత్రణ చట్టం తేవాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు షేక్‌ జాఫర్‌ డిమాండ్‌ చే శారు.

మే 26న‌ జిల్లా కేంద్రంలో ఆయన వి లేకరులతో మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా పాఠశాలల ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చే యాలని డిమాండ్‌ చేశారు.

ప్రొఫెషనల్‌ కో ర్సులకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) తరహాలో ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ వేయాలని కోరారు. దేశంలో 15 రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలులో ఉందని గుర్తు చేశారు.

చదవండి: School Admissions: మన బడుల్లో చేరండి.. విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారు ప్రణాళిక

నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, బూట్లు, టై బెల్టులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి సాయి, నాయకులు తిరుపతి, సాయి తదితరులు పాల్గొన్నారు.

#Tags