Skip to main content

Study Center : ఓపెన్ ప‌ది, ఇంట‌ర్ స్ట‌డీ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు.. ఇవి త‌ప్పనిస‌రిగా పాటించాలి!

Permission for Management of Open School Centers  Educational Opportunity in Chittoor  AP Open School Announcement  Applications for permits of Study Centres for Tenth and Inter students  AP Open School State Director Nageswara Rao

చిత్తూరు: ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్ల నిర్వహణకు అనుమతులు పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ రాష్ట్ర డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు గురువారం డీఈఓ కార్యాలయానికి అందాయి. జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్మీడియెట్‌ స్టడీ సెంటర్లు నిర్వహించాలనుకునేవారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు చేసుకునేవారు తప్పనిసరిగా ఉత్తర్వుల్లో పేర్కొన్న నియమ, నిబంధనలు పాటించాలని తెలిపారు. అందిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇస్తారన్నారు. ఏవైనా సందేహాలు ఉన్న‌ట్లైతే డీఈఓ కార్యాలయంలోని ఓపెన్‌ స్కూల్‌ విభాగంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

First Class Admissions : 1వ తరగతిలో ఉచిత ప్రవేశానికి 3వ ఎంపిక జాబితా విడుద‌ల‌..!

Published date : 28 Jun 2024 10:27AM

Photo Stories